జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టుల ఘాతుకం, బీజేపీ నేత కాల్చివేత
జమ్మూ కాశ్మీర్ లోని బడ్గామ్ జిల్లాలో బీజేపీ నేత భూపేందర్ సింగ్ ను టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఈ జిల్లాలోని ఖాగ్ ప్రాంత బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ చైర్మన్ కూడా అయిన ఈయన గతరాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో...

జమ్మూ కాశ్మీర్ లోని బడ్గామ్ జిల్లాలో బీజేపీ నేత భూపేందర్ సింగ్ ను టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఈ జిల్లాలోని ఖాగ్ ప్రాంత బ్లాక్ డెవలప్ మెంట్ కౌన్సిల్ చైర్మన్ కూడా అయిన ఈయన గతరాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో తన గ్రామానికి బయల్దేరి ఇల్లు చేరగానే ఆయన ఇంట్లోనే మాటు వేసి ఉన్న ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారు. భూపేందర్ సింగ్ కి ఇద్దరు పర్సనల్ గార్డులు ఉన్నప్పటికీ ఆయన వారిని ఖాగ్ పోలీసు స్టేషన్ వద్దే వదిలి తన గ్రామానికి బయలుదేరి వెళ్లారని పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ప్రధానంగా బీజేపీ నేతలను, సర్పంచులను లక్ష్యంగా చేసుకుని వారిని హతమారుస్తున్నారు.




