దేశవ్యాప్తంగా కొత్తగా 86,507 మందికి కరోనా
దేశంలో కరోనా వికృతరూపం కొనసాగుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న కొత్త కేసులు ఆందోళన కలిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 86,507 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు కేంద్ర వైద్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా వికృతరూపం కొనసాగుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న కొత్త కేసులు ఆందోళన కలిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 86,507 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు కేంద్ర వైద్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో గురువారం నాటికి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 57,32,518కు చేరినట్లు తెలిపింది. వీరిలో ఇప్పటికే 46లక్షల 74వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 9 లక్షల 66వేల మంది యాక్టివ్ కేసులు ఉండగా.. వీరంతా దేశ వ్యాప్తంగా వివిధ ఆస్పత్రలతో పాటు హోం ఐసోలేషన్ లో ఉంటూ కరోనా చికిత్స పొందుతున్నారు. నిన్న మరో 86వేల మంది కరోనా రోగులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా సోకి మరణిస్తున్న వారిసంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం దాదాపు వెయ్యి మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు. నిన్న మరో 1,129 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకి మృతిచెందిన వారిసంఖ్య 91,149కు చేరింది. అయితే, కరోనా సోకి ప్రాణాలు కోల్పోతున్న వారిలో దాదాపు 70శాతానికి పైగా ఇతర ఆరోగ్యసమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేస్తోంది. ప్రస్తుతం రోజువారీగా నమోదవుతున్న కేసుల కంటే రికవరీ రేటు ఎక్కువగా ఉండడం కొంత ఊరట కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 81.55శాతం ఉండగా, మరణాల రేటు 1.59శాతంగా ఉంది. కాగా, నిన్న ఒక్కరోజే 11,56,569 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్.




