Rahul Gandhi: ట్రాక్టర్ తోలిన రాహుల్ గాంధీ.. రైతు చట్టాలను రద్దు చేయాలని వినూత్న నిరసన..
Farmers Protest: వివాదాస్పదమైన మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఢిల్లీలో ట్రాక్టర్ నడిపి వినూత్న నిరసన తెలిపారు. పార్లమెంటుకు తాను రైతుల సందేశాన్ని తీసుకువచానని, ప్రభుత్వం అన్నదాతల వాణిని నొక్కేస్తోందని ఆయన ఆరోపించారు.
వివాదాస్పదమైన మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం ఢిల్లీలో ట్రాక్టర్ నడిపి వినూత్న నిరసన తెలిపారు. పార్లమెంటుకు తాను రైతుల సందేశాన్ని తీసుకువచానని, ప్రభుత్వం అన్నదాతల వాణిని నొక్కేస్తోందని ఆయన ఆరోపించారు. వీరి డిమాండుపై సభలో చర్చ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన అన్నారు. ఈ నల్ల చట్టాలను కేంద్రం రద్దు చేయాల్సిందేనని, ఇవి కేవలం ఇద్దరు, ముగ్గురు బడా వ్యక్తుల ప్రయోజనానికే అన్న విషయం దేశానికి తెలుసునని ఆయన చెప్పారు. అన్నదాతలు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది.. మరోవైపు పార్లమెంటు బయట నిరసన పాటిస్తున్నవారిని టెర్రరిస్టులని పేర్కొంటోంది.. ఇదెక్కడి న్యాయం అని ఆయన ప్రశ్నించారు. వీరి హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన దుయ్యబట్టారు.
ఇలా ఉండగా ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా, యూత్ కాంగ్రెస్ చీఫ్ శ్రీనివాస్ బీవీ..మరి కొందరు పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులో ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి వీరు ట్రాక్టర్ మార్చ్ నిర్వహించారని కేసు పెట్టారు. మరోవైపు.. ఢిల్లీలో పార్లమెంటు కొనసాగుతున్నంత కాలం తమ నిరసన కొనసాగుతుందని రైతు సంఘం నేత రాకేష్ తిఖాయత్ ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద తమ ‘పోటీ పార్లమెంట్’ ప్రొటెస్ట్ ని ఆగస్టు 13 వరకు కూడా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈ ఆందోళనలో మరింతమంది రైతులు పాల్గొంటారని ఆయన అన్నారు. అరెస్టులకు తాము భయపడేది లేదని ఆయన పేర్కొన్నారు. అటు-ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు హర్యానాలో బీజేపీ నేతలను జాతీయ జెండాలు ఎగురవేయనివ్వబోమని నిన్న రైతులు హెచ్చరించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Shyam Singha Roy: షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసిన శ్యామ్ సింగరాయ్ టీమ్.. త్వరలోనే..
Strawberry : బ్యూటీ కోసం స్ట్రాబెర్రీ..! యువతకు మంచి కిక్కిచ్చే ఫ్రూట్.. ప్రయోజనాలు అద్భుతం..