Mehul Choksi: ‘రా’ ఏజెంట్లు నన్ను కొట్టారు.. ఆంటిగ్వా లో మెహుల్ చోక్సీ కొత్త వాదన.. ఇండియాను ఇరకాటంలో పెట్టేందుకేనా ?

ఆంటిగ్వా నుంచి తనను కిడ్నాప్ చేసినవారిలో ఇద్దరు 'రా' (రీసెర్చ్అండ్ ఎనాలిసిస్ వింగ్) కి చెందినవారని వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తెలిపాడు. ప్రస్తుతం ఆంటిగ్వా లో ఉన్న ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ..

Mehul Choksi: 'రా' ఏజెంట్లు నన్ను కొట్టారు.. ఆంటిగ్వా లో మెహుల్ చోక్సీ కొత్త వాదన.. ఇండియాను ఇరకాటంలో పెట్టేందుకేనా ?
Mehul Choksi
Follow us

| Edited By: Phani CH

Updated on: Jul 26, 2021 | 11:28 AM

ఆంటిగ్వా నుంచి తనను కిడ్నాప్ చేసినవారిలో ఇద్దరు ‘రా’ (రీసెర్చ్అండ్ ఎనాలిసిస్ వింగ్) కి చెందినవారని వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తెలిపాడు. ప్రస్తుతం ఆంటిగ్వా లో ఉన్న ఆయన ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ..తన కిడ్నాపింగ్ సమయంలో గుర్మీత్ సింగ్, గుర్ జిత్ భండాల్ అనే వ్యక్తులు కొట్టారని వెల్లడించాడు. అప్పుడు తాను బార్బరా జరాబికా అనే మహిళ ఇంట్లో ఉన్నానని, అక్కడ తనపై దాడి జరుగుతుండగా ఈ ఇద్దరు వ్యక్తులూ తమను ‘రా’ ఏజెంట్లుగా చెప్పుకున్నారని అన్నాడు. డొమినికాకు చేరినప్పుడు సైతం ఈ ఇద్దరూ తన కాళ్ళు, చేతులు పట్టుకుని..ఇష్టం వచ్చినట్టు కొట్టారని పేర్కొన్నాడు. తనకు స్పృహ కోల్పోయినంత పనయిందన్నాడు. గతంలో ఒకసారి తన కిడ్నాపింగ్ జరిగినప్పుడు ఈయన డొమినికా పోలీసులే తనను తీవ్రంగా కొట్టినట్టు చెప్పిన విషయం గమనార్హం. కానీ ఇప్పుడు ‘రా’ ఏజంట్ల గురించి చెప్పుకొచ్చాడు. ఈ ఇద్దరూ ఈ ద్వీప సముదాయాల చుట్టూ, ప్రపంచ దేశాల్లోనూ తిరుగుతుంటారని తెలిసినట్టు వెల్లడించాడు.

నిజానికి తనను అపహరించుకు పోవడానికి కుట్ర జరిగిందన్న విషయం తనకు ముందే..అంటే 2019 లోనే తెలిసిందని, ఇండియా నుంచి ఓ విమానం వచ్చి నిన్ను ఆ దేశానికి తీసుకువెళ్తుందని కొందరు చెప్పారని చోక్సీ వివరించాడు. ఇండియా ఆంటీగ్వాకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిందంటే ఇక ఇక్కడి నుంచి నిన్ను తీసుకువెళ్లేందుకే అని వారు చెప్పారన్నాడు. అంటే ఇది రిటర్న్ గిఫ్ట్ అని వారు వ్యాఖ్యానించారని అన్నాడు. ఇండియా కుట్ర విషయం నాకు తెలుసు అని చోక్సీ పేర్కొన్నాడు. ప్రస్తుతం డొమినికా కోర్టు నుంచి బెయిల్ మీదున్న ఈయన.. తాను ఇండియాకు వెళ్లే ప్రసక్తే లేదని చెప్పాడు. తనను డొమినికా గానీ..ఆంటిగ్వా గానీ ఇండియాకు అప్పగించబోదని ఆశిస్తున్నట్టు తెలిపాడు..

మరిన్ని ఇక్కడ చూడండి: Indonesia: వారంలో 500మంది చిన్నారుల బలి.. 50వేల కొత్త కేసులు.. ఇండోనేసియాలో డెల్టా డెత్ గేమ్..

Yoga Tips : ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడానికి ఈ 3 యోగా టిప్స్ పాటించండి..! మంచి ఉపశమనం ఉంటుంది..