India Corona News: దేశంలో కొత్తగా 39,361 కరోనా కేసులు, యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది.క్రితం రోజుతో పోల్చుకుంటే కేసుల సంఖ్య స్పల్పంగా తగ్గింది. ఆదివారం 11,54,444 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది.క్రితం రోజుతో పోల్చుకుంటే కేసుల సంఖ్య స్పల్పంగా తగ్గింది. ఆదివారం 11,54,444 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 39,361 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3,14,11,262 చేరింది. మరో 416మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,20,967కు చేరింది. ప్రస్తుతం క్రియాశీల రేటు 1.31కి చేరగా.. రికవరీ రేటు 97.35 శాతంగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో రికవరీల కంటే కొత్త నమోదయ్యే కేసులే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
- మొత్తం కేసులు: 3,14,11,262
- మొత్తం మరణాలు: 4,20,967
- కోలుకున్నవారు: 3,05,79,106
- యాక్టివ్ కేసులు: 4,11,189
దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. కొత్తగా 18,99,874 మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 43,51,96,001కు చేరినట్లు వెల్లడించింది.
డెల్టా వేరియంట్‌తో పెనుప్రమాదం
కరోనాలో వెలుగు చూసిన వేరియంట్లన్నింటిలోకి అత్యంత ఎక్కువగా సంక్రమణ శక్తిని ప్రదర్శిస్తున్న డెల్టా రకాన్ని కట్టడి చేయడానికి ముమ్మర చర్యలు అవసరమని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ వేరియంట్ బారినపడినవారికి దగ్గరగా వెళ్లిన వారిని ప్రారంభ దశలోనే గుర్తించడానికి వ్యవధి తక్కువగా ఉంటోందని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని నేపథ్యంలో ఈ రకం ఉద్ధృతికి కళ్లెం వేయాలంటే ఇలాంటివారిని శరవేగంగా గుర్తించడం ముఖ్యమని హెచ్చరిస్తున్నారు. వుహాన్ రకంతో పోలిస్తే.. డెల్టా వేరియంట్ బారినపడిన వ్యక్తి నుంచి వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్ వెలువడుతున్నట్లు ఒక అధ్యయనంలో తేల్చింది. డెల్టా వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం, ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సి రావడం, మరణం ముప్పు రెట్టింపు స్థాయిలో ఉంటాయని మరో పరిశోధనలో వెల్లడైంది.
Also Read: ‘రామప్ప’కు కీర్తి దక్కింది.. ఇప్పుడు క్రెడిట్ పంచాయతీ మొదలయ్యింది…