Yogi Adityanath: కుమార్తెలకు సీఎం యోగి రక్షాబంధన్ కానుక.. ఇప్పటినుంచి ఖాతాల్లో 25 వేలు జమ..
రక్షా బంధన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ కానుక అందించారు. రక్షాబంధన్ సందర్భంగా 'ముఖ్యమంత్రి కన్యా సుమంగళ' పథకం లబ్ధిదారులతో మాట్లాడిన సందర్భంగా సీఎం యోగి.. ఈ పథకం మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు.

రక్షా బంధన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారీ కానుక అందించారు. రక్షాబంధన్ సందర్భంగా ‘ముఖ్యమంత్రి కన్యా సుమంగళ’ పథకం లబ్ధిదారులతో మాట్లాడిన సందర్భంగా సీఎం యోగి.. ఈ పథకం మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. కన్యా సుమంగళ యోజన మొత్తాన్ని 15 వేల నుంచి 25 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద గతంలో ఆరు దశల్లో రూ.15 వేల ప్యాకేజీ ఇచ్చామని, వచ్చే ఏడాది నుంచి కూతురు పుట్టిన వెంటనే ఆమె సంరక్షకురాలి ఖాతాకు రూ.5 వేలు జమ చేస్తామని చెప్పారు. కూతురికి ఏడాది వయస్సు వచ్చినప్పుడు రెండు వేలు, కూతురు ఒకటవ తరగతిలో చేరగానే మూడు వేలు, ఆరో తరగతిలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత మూడు వేలు, తొమ్మిదో తరగతికి వెళ్లేసరికి ఐదు వేలు.. గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా లేదా ఏదైనా సర్టిఫికేట్ కోర్సు పూర్తిచేయగానే ఆమె ఖాతాకు ఏడు వేల రూపాయల మొత్తాన్ని బదిలీ చేయనున్నట్లు వివరించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కన్యా సుమంగళ యోజన ద్వారా నేడు 16,24,000 వేల మంది కుమార్తెలు లబ్ధి పొందుతున్నారని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో ఈ రోజు చాలా ముఖ్యమైనదంటూ సంతోషం వ్యక్తంచేశారు.




సీఎం యోగి ఆదిత్యనాథ్ కు రాఖీ కట్టిన బాలిక..

CM Yogi
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు బాలికలు, కన్యా సుమంగళ యోజన లబ్ధిదారులు సీఎం యోగి నుదుటిపై తిలకం దిద్ది.. చేతికి రాఖీలు కట్టారు. సీఎం యోగి వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం యోగి 29523 మంది లబ్ధిదారుల ఖాతాలకు ఒక్క క్లిక్ ద్వారా రూ.5.82 కోట్లను బదిలీ చేశారు.
अभी तक हम बेटियों को ‘कन्या सुमंगला योजना’ के अंतर्गत ₹15,000 उपलब्ध करा रहे हैं, अगले वित्तीय वर्ष में इसे बढ़ाकर ₹25,000 करेंगे: #UPCM @myogiadityanath pic.twitter.com/rTp8KsIMNl
— CM Office, GoUP (@CMOfficeUP) August 30, 2023
కల సాకారం..
ఈ పథకం ద్వారా తాను చదువుకోగలుగుతున్నానని, అది తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పథకం లబ్ధిదారు రత్న మిశ్రా తెలిపారు. రాష్ట్ర ఆడబిడ్డలను ఆదుకునే సీఎం యోగి తనకు ఉన్నందున ఇప్పుడు తన కలలను సాకారం చేసుకోగలుగుతున్నానని ఆమె అన్నారు.
దీని ద్వారానే చదువు..
10వ తరగతి చదువుతున్న అక్షర కుష్వాహ మాట్లాడుతూ.. ఈ పథకం తనలాంటి నిరుపేద బాలికల జీవితాల్లో పెద్ద మార్పు తెచ్చిందని, దీని ద్వారా తాను చదువుకుని ఇతర పిల్లలతో అంచెలంచెలుగా నడవగలుగుతున్నానని, ఇందుకు సీఎం యోగికి కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




