Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. అసలు ఏం జరిగిందంటే ?

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్‌లో మెనేజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ దారుణమైన ఘటన మంగళవారం రోజున ఢిల్లీలోని భజన్‌పురలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే ఢిల్లీకి చెందిన హర్‌‌ప్రీత్ గిల్ అనే 36 ఏళ్ల వ్యక్తి అమెజాన్‌లో మేనేజర్‌గా తన విధులు నిర్వర్తిస్తున్నారు.

అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. అసలు ఏం జరిగిందంటే ?
Amazon Manager Harpreet Gill
Follow us
Aravind B

|

Updated on: Aug 30, 2023 | 6:01 PM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్‌లో మెనేజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు హత్య చేయడం కలకలం రేపుతోంది. ఈ దారుణమైన ఘటన మంగళవారం రోజున ఢిల్లీలోని భజన్‌పురలో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే ఢిల్లీకి చెందిన హర్‌‌ప్రీత్ గిల్ అనే 36 ఏళ్ల వ్యక్తి అమెజాన్‌లో మేనేజర్‌గా తన విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మంగళవారం రోజు రాత్రి 11.30 గంటల సమయంలో తన మేనమామతో కలిసి భజన్‌పులోని సుభాష్ విహార్ ప్రాంతంలో వారు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది దుండగులు బైక్‌పై వచ్చి ఆ ఇద్దరిని అడ్డుకున్నారు. ఆ తర్వాత వారిపై కాల్పులు జరిపారు. ఇదు గమనించిన స్థానికులు ఆ ఇద్దర్ని ప్రేవేటు ఆసుపత్రికి తరలించారు.

కానీ అప్పటికే అమెజాన్ మేనేజర్ హర్‌ప్రత్ గిల్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మేనమామకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై హర్‌ప్రిత్ గిల్ మేనమామ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తాము బైక్‌పై వెళ్తుండగా ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి తనపై.. తన మేనల్లుడిపై కాల్పులు జరిపారని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా హర్‌ప్రీత్ ఇంటి నుంచి బయటికి వెళ్తూ 10 నిమిషాల్లో మళ్లీ వస్తానని తన తల్లిదండ్రులకు చెప్పారు. కానీ ఈ దుండగులు జరిపిన కాల్పుల వల్ల హర్‌ప్రీత్ తలపై కుడి వైపు, బుల్లెట్ గాయాలు తగిలినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి తదుపరి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే మృతుడు హర్‌ప్రీత్ గిల్ మేనమామ భజన్‌పూరాలో ఉంటున్నారు. అతనికి కూడా తలపై కాల్పులు జరిగాయి.

ప్రస్తుతం అతడ్ని లోక్‌నాయక్ జై ప్రకాష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇదే ప్రాంతానికి చెందినటువంటి ఓ ముఠా ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఈ గ్యాంగ్ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో చాలా యాక్టివ్‌గా ఉందని పోలీసులు తెలిపారు. నగరంలో పెద్ద డాన్ కావాలనే ఆశతో.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయుధాలతో తన ఫోటోలు.. వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అసలు ఈ దుండగులు ఎవరు.. అమెజాన్ మేనేజర్ హర్‌ప్రీత్ గిల్, అతని మేనమామపై కాల్పులు జరపాల్సిన అవసర ఎందుకు వచ్చింది అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వాళ్లను అదుపులోకి తీసుకున్నాక అన్ని విషయాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..