Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని రేసులో ఉన్నారా ?.. క్లారిటీ ఇచ్చిన ఆప్..

జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడిన ఇండియా కూటమి మరోసారి భేటీ అయ్యేందుకు సన్నద్ధమైంది. అయితే ఈ సమయంలో ఆ కూటమిలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ సీఎంగా, దేశానికి ఓ మోడల్‌ను అందించినటువంటి అరవింద్ కేజ్రీవాల్.. కూటమికి సారథ్యం వహించడంతో సహా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పింది. మరో విషయం ఏంటంటే.. గురువారం రోజున ఇండియా కూటమిలో ఉన్న 27 పార్టీలు భేటీ కానున్నాయి.

Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని రేసులో ఉన్నారా ?.. క్లారిటీ ఇచ్చిన ఆప్..
Arvind Kejriwal
Follow us
Aravind B

|

Updated on: Aug 30, 2023 | 5:37 PM

జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పడిన ఇండియా కూటమి మరోసారి భేటీ అయ్యేందుకు సన్నద్ధమైంది. అయితే ఈ సమయంలో ఆ కూటమిలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ సీఎంగా, దేశానికి ఓ మోడల్‌ను అందించినటువంటి అరవింద్ కేజ్రీవాల్.. కూటమికి సారథ్యం వహించడంతో సహా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పింది. మరో విషయం ఏంటంటే.. గురువారం రోజున ఇండియా కూటమిలో ఉన్న 27 పార్టీలు భేటీ కానున్నాయి. ఇలాంటి సమయంలో ఆప్ పార్టీ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇండియా కూటమి తరపున పీఎం అభ్యర్థిగా ఎవరు ఉంటారని పీటీఐ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియంక కక్కర్ స్పందించారు. కూటమి జాతీయ కన్వీనర్‌గా కేజ్రివాల్ పేరును ప్రతిపాదిస్తానని పేర్కొన్నారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే మోడల్‌ను కేజ్రీవాల్ అందించారని అన్నారు.

అలాగే ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్‌రాయ్ కూడా స్పందించారు. కూటమిలోని ప్రతిపార్టీ కూడా తమ నేతనే ప్రధాని మంత్రిగా చూడాలని కోరుకుంటాన్నారని అన్నారు. ఈ క్రమంలోనే ఆప్ కూడా తన జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ప్రధాని కావాలని కోరుకుంటోందని చెప్పారు. అయితే ఈ విషయంపై కూటమిలోని అన్ని పార్టీలు ఒక నిర్ణయం తీసుకుంటాయని.. దీనికి అనుగుణంగా తామందరం ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ ఆర్థికశాఖ మంత్రి అతిషీ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి రేసులో లేరని పేర్కొన్నారు. ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియంక కక్కర్.. కేజ్రీవాల్ పీఎం కావాలని ఆశిస్తున్నట్లు చెప్పిన తర్వాత.. మంత్రి అతిషీ ఈ వ్యా్ఖ్యలు చేయడం గమనార్హం. అయితే రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము ఇండియా కూటమిలో చేరామని అతిషీ అన్నారు. కానీ కేజ్రీవాల్ ప్రధాని అయ్యే రేసులో లేరని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా భవిష్యత్తు ప్రణాళిక, కూటమి లోగో వంటి ఇతరాత్రా విషయాలను చర్చించేందుకు విపక్ష కూటమి సిద్ధమైపోయింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 2 వతేదీల్లో ముంబయిలో జరగబోయే ఈ భేటీగా కొత్తగా మరిన్ని పార్టీలు కూడా హాజరవుతాయని కూటమి వర్గాలు తెలిపాయి. అయితే ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిని ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని చెప్పాయి. అయితే ఈ సమావేశంలోనే అశోక చక్రంలేని ఇండియా జెండాను కూటమి తమ జెండాగా ప్రకటించాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. అలాగే కూటమిలో పార్టీల మధ్య ఉన్నటువంటి.. మనస్పర్థలు, విభేదాలను పక్కకు పెట్టే విధంగా రూపకల్పన కూడా చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..