Hemant Soren: బీజేపీపై సోరెన్ ప్రతీకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా వ్యూహం..!

భూ అక్రమాల కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) అరెస్టు చేసిన నేపథ్యంలో సోరెన్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలైన సోరెన్, జులై 4న మళ్లీ జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంపై సోరెన్, హేమంత్ సోరెన్ విడుదలైన తర్వాత అంత త్వరగా తన పదవిని అప్పగించేందుకు ఒప్పుకోలేదు.

Hemant Soren: బీజేపీపై సోరెన్ ప్రతీకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలుపే లక్ష్యంగా వ్యూహం..!
Hemant Soren
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 10, 2024 | 1:11 PM

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా తిరిగి పగ్గాలు చేపట్టిన హేమంత్ సోరెన్ భారతీయ జనతా పార్టీ (BJP)పై పగ తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళాన్ని మట్టి కరిపించడమే అసలైన ప్రతీకారంగా భావిస్తున్నారు. ఐదు నెలలకు పైగా జైలు జీవితాన్ని రుచి చూపించిన కాషాయదళానికి ఓటమి రుచి చూపించాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. వ్యూహప్రతివ్యూహాల్లో అపర చాణక్యులుగా పేరుగాంచిన మోదీ-షా ద్వయాన్ని సోరెన్ ఎంత మేర ఎదుర్కొంటారన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజకీయ ప్రత్యర్థిపై యుద్ధానికి సన్నద్ధమయ్యే ముందు ఆయనకు ఇంటి పోరును అధిగమించడమే ఒక సవాలుగా మారింది.

పక్కలో బల్లెం!

భూ అక్రమాల కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) అరెస్టు చేసిన నేపథ్యంలో సోరెన్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలైన సోరెన్, జులై 4న మళ్లీ జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంపై సోరెన్, హేమంత్ సోరెన్ విడుదలైన తర్వాత అంత త్వరగా తన పదవిని అప్పగించేందుకు ఒప్పుకోలేదు. తనకు కనీసం డిప్యూటీ సీఎం పదవైనా ఇవ్వాలంటూ గట్టిగా పట్టుబట్టారు. చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు రాష్ట్రీయ జనతా దళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. మొత్తానికి చంపై సోరన్‌కు కొత్త మంత్రివర్గంలో కీలకమైన జల వనరుల శాఖతో పాటు ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలు దక్కాయి. అలా చివరకు పార్టీ చీలిక ముప్పు తలెత్తకుండా నివారించగలిగారు. కానీ ఏ కాస్త అవకాశం చిక్కినా.. పార్టీలను చీల్చి, అధికార పగ్గాలు చేపట్టడంలో సిద్ధహస్తులైన కమలనాథులు, చంపై సోరెన్‌ను ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు. గిరిజన – ఆదివాసీ నేతల్లో సీనియర్ నేతైన చంపై సోరెన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు పక్కలో బల్లెం అనడంలో అతిశయోక్తి లేదు.

మరి కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అప్పటి వరకు ముఖ్యమంత్రిగా చంపై సోరెన్‌ను కొనసాగించాలని తొలుత భావించారు. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నాయకత్వంలో అధిక భాగం ఈ ప్రతిపాదనపై విముఖత వ్యక్తం చేశారు. చంపై సమర్థుడైన నేతగా, పాలకుడిగా పేరు తెచ్చుకున్నప్పటికీ, హేమంత్ సోరెన్‌ తరహాలో ప్రజల్లో ఆదరణ, కరిష్మా లేవని వారి అభిప్రాయం. ఆయన నాయకత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటే గెలుపు కష్టం అని అధినేతకు సూచించారు. అందుకే కొద్ది నెలలే గడువు మిగిలినప్పటికీ.. మళ్లీ సీఎంగా హేమంత్ సోరెన్ పగ్గాలు చేపట్టారు. మొత్తం 81 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో.. ప్రస్తుతం 76 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 45 మంది మద్దతుతో సోరెన్ తన బలాన్ని నిరూపించుకున్నారు.

ప్రాంతీయ, సామాజిక సమీకరణాలతో కేబినెట్

ముఖ్యమంత్రి సహా మొత్తం 12 మందితో కూడిన జార్ఖండ్ మంత్రివర్గంలో ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని చోటు కల్పించారు. మంత్రివర్గంలో గిరిజన-ఆదివాసీ (ఎస్టీ)లు 5 గురు ఉండగా, ముగ్గురు వెనుకబడి తరగతులు (ఓబీసీ)కు చెందినవారు, ఇద్దరు ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినవారు, ఒక దళిత వర్గం నేత, ఒకరు అగ్రవర్ణానికి చెందిన నేత ఉన్నారు. జార్ఖండ్ రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 27 శాతం, ఓబీసీలు 45 శాతం ఉన్నారు. ఈ రెండు వర్గాలు కలిపి అత్యధికంగా 71 శాతం ఉండగా, ముస్లిం జనాభా 16 శాతం, దళితులు 10 శాతం వరకు ఉన్నారు. అత్యధిక జనాభా కల్గిన ఎస్టీ, ఓబీసీ వర్గాల నుంచి 8 మందికి కేబినెట్‌లో చోటు కల్పించారు. సామాజికంగా ఇలా ఉంటే, ప్రాంతాలవారీగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ప్రాతినిథ్యం దక్కేలా సోరెన్ జాగ్రత్తలు తీసుకున్నారు. పాలము, కోలాన్, ఉత్తర – దక్షిణ చోటా‌నాగ్‌పూర్, సంతాల్ పరగణ ప్రాంతాల నుంచి సమంగా ప్రాతినిధ్యం ఉండేలా కేబినెట్ కూర్పు జరిగింది.

మిత్రపక్షాల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన దీపికా పాండే, ఇర్ఫాన్ అన్సారీ ఉండగా, ఆర్జేడీ ఎమ్మెల్యే సత్యానంద్ భోక్తాకు హేమంత్ మంత్రివర్గంలో చోటు లభించింది.

సోదరుడికి దక్కని చోటు

ఎన్నికలు జరిగే వరకు కొనసాగనున్న ఈ మంత్రివర్గంలో హేమంత్ సోరెన్ తన సోదరుడు బసంత్ సోరెన్‌ను దూరం పెట్టారు. డుమ్కా ఎమ్మెల్యేగా ఉన్న బసంత్ సోరెన్‌కు అవకాశం కల్పిస్తారని ఊహాగానాలు చెలరేగినప్పటికీ.. కుటుంబ, వారసత్వ రాజకీయాల పేరుతో బీజేపీ నేతలకు విమర్శించే అవకాశం కల్పించినట్టవుతుందని హేమంత్ భావించారు. మరోవైపు చంపై సోరెన్‌ను సీఎం పదవి నుంచి గద్దె దించి, తన సొంత సోదరుడు బసంత్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న తప్పుడు సంకేతాలు పార్టీ శ్రేణుల్లోకి, ప్రజల్లోకి వెళ్తాయని కూడా హేమంత్ ఆలోచించినట్టు కనిపిస్తోంది. హేమంత్ వదిన సీతా సోరెన్ మాదిరిగా కాకుండా (చనిపోయిన హేమంత్ సోదరుడు దుర్గా సోరెన్ భార్య) మంత్రి పదవి దక్కకపోయినా సరే బసంత్ మాత్రం పార్టీతో పాటు, సోదరుడు హేమంత్ పట్ల విధేయతను కొనసాగిస్తున్నారు. హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేసినప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని తనకే అప్పగిస్తారని ఆశించిన సీతా సోరెన్, అది దక్కకపోవడంతో సరిగ్గా లోక్‌సభ ఎన్నికలకు ముందు జేఏఎం వీడి బీజేపీలో చేరారు. బసంత్ 2020లో జరిగిన ఉపఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు డుమ్గా, బర్హాత్ నుంచి గెలుపొందారు. రెండింట్లో డుమ్కాను వదులుకోగా, అక్కణ్ణుంచి సోదరుడు బసంత్‌ను బరిలోకి దించి గెలిపించుకున్నారు. గత ఐదేళ్లుగా కాంగ్రెస్, ఆర్జేడీతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈసారి కూడా ఇండి (I.N.D.I.A) కూటమిగా ఎన్నికల రణరంగంలో బీజేపీ నేతృత్వంలోని కూటమి (NDA)ను ఎదుర్కోనున్నారు. తమకు అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీల నేతలను వదిలి, ప్రత్యర్థులుగా ఉన్నవారిపైనే సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్న బీజేపీని జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి గుణపాఠం నేర్పాలని హేమంత్ సోరెన్ వ్యూహాలు రచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్డుతో హెయిర్ ప్యాక్స్.. సింపుల్ టిప్స్‌తో బోలెడన్నీ బెనిఫిట్స్
గుడ్డుతో హెయిర్ ప్యాక్స్.. సింపుల్ టిప్స్‌తో బోలెడన్నీ బెనిఫిట్స్
జంపింగ్ జగడం.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ..
జంపింగ్ జగడం.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ..
వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి
వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి
చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. 100 మిలియన్లు దాటిన ఫాలోవర్లు..
చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. 100 మిలియన్లు దాటిన ఫాలోవర్లు..
ఆడవారు కలోంజీ సీడ్స్ తింటే ఈ సమస్యలన్నీ దూరం.. లాభాలు తెలిస్తే..!
ఆడవారు కలోంజీ సీడ్స్ తింటే ఈ సమస్యలన్నీ దూరం.. లాభాలు తెలిస్తే..!
సీఎమ్‌ఎఫ్‌ నుంచి స్మార్ట్‌ వాచ్‌.. స్టన్నింగ్ లుక్స్‌తో..
సీఎమ్‌ఎఫ్‌ నుంచి స్మార్ట్‌ వాచ్‌.. స్టన్నింగ్ లుక్స్‌తో..
పీఎఫ్ సొమ్ముతో హోమ్‌లోన్ క్లియర్ చేస్తున్నారా..?
పీఎఫ్ సొమ్ముతో హోమ్‌లోన్ క్లియర్ చేస్తున్నారా..?
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా.. లావణ్య కామెంట్స్..
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా.. లావణ్య కామెంట్స్..
ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. రోగిని కాల్చి చంపిన యువకుడు!
ఆసుపత్రిలో కాల్పుల కలకలం.. రోగిని కాల్చి చంపిన యువకుడు!
టీమిండియా మాజీ ఆటగాడికి కోటి రూపాయల సాయం.. ఎందుకంటే?
టీమిండియా మాజీ ఆటగాడికి కోటి రూపాయల సాయం.. ఎందుకంటే?
వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి
వరంగల్‌ జిల్లాలో డబుల్‌ మర్డర్‌ కలకలం.. లవర్ ఫ్యామిలీని గొంతుకోసి
శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!
శ్రీశైలంలో చిరుతలు స్వైర విహారం.. టోల్‌గేట్‌ వద్ద కుక్కపై దాడి.!
ఈ కండక్టర్‌ వెరీ ఫ్రెండ్లీ బ్రో.. ఆర్టీసీ డిపోలో సుధాకర్‌రావు.
ఈ కండక్టర్‌ వెరీ ఫ్రెండ్లీ బ్రో.. ఆర్టీసీ డిపోలో సుధాకర్‌రావు.
టేకాఫ్ సమయంలో పేలిన విమానం టైరు.. వీడియో వైరల్.
టేకాఫ్ సమయంలో పేలిన విమానం టైరు.. వీడియో వైరల్.
చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.! సీనియర్ జర్నలిస్ట్‌పై రోహిని..
చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.! సీనియర్ జర్నలిస్ట్‌పై రోహిని..
ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న అది చెయ్యాల్సిందే! బోల్డ్ కామెంట్స్..
ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న అది చెయ్యాల్సిందే! బోల్డ్ కామెంట్స్..
రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.? రష్మి సీరియస్..
రేప్‌ చేసి చంపేసిన వాళ్లను మైనర్లని ఎలా అంటారు.? రష్మి సీరియస్..
అంబానీల పెళ్లిలో రజినీ సూపర్ డ్యాన్స్.! అదిరిపోయే వీడియో..
అంబానీల పెళ్లిలో రజినీ సూపర్ డ్యాన్స్.! అదిరిపోయే వీడియో..
ఇండియన్ 2 డే1 కలెక్షన్స్.. అబ్బో.. గట్టిగానే వచ్చాయిగా.!
ఇండియన్ 2 డే1 కలెక్షన్స్.. అబ్బో.. గట్టిగానే వచ్చాయిగా.!
అంబానీల పెళ్లిలో ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ ఎంట్రీ..
అంబానీల పెళ్లిలో ఏపీ డిప్యూటీ సీఎం గ్రాండ్ ఎంట్రీ..