AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cloudburst In Uttarakhand: ఉత్తరాఖండ్​లో విరిగిపడ్డ కొండచరియలు.. ఆకస్మిక వరదలతో ఇళ్లు, దుకాణాల ధ్వంసం..!

ఉత్తరాఖండ్​ తెహ్రీ జిల్లాలోని దేవప్రయాగ్​లో ఆకస్మిక వరదలు సంభవించాయి. అకాల వర్షాలకు శాంతానది ఉప్పొంగింది. కొండచరియలు విరిగిపడి వరదల ధాటికి డజన్ల కొద్ది ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి.

Cloudburst In Uttarakhand: ఉత్తరాఖండ్​లో విరిగిపడ్డ కొండచరియలు.. ఆకస్మిక వరదలతో ఇళ్లు, దుకాణాల ధ్వంసం..!
Cloudburst In Uttarakhand's Devprayag
Balaraju Goud
|

Updated on: May 12, 2021 | 7:19 AM

Share

Cloudburst In Uttarakhand: ఉత్తరాఖండ్​ తెహ్రీ జిల్లాలోని దేవప్రయాగ్​లో ఆకస్మిక వరదలు సంభవించాయి. అకాల వర్షాలకు శాంతానది ఉప్పొంగింది. కొండచరియలు విరిగిపడి వరదల ధాటికి డజన్ల కొద్ది ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. రెండు మున్సిపల్​ భవనాలు కూడా నేలమట్టమయ్యాయి. పాదాచారుల బ్రిడ్జ్​లు ధ్వంసం అయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్​ అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని అధికారులు పేర్కొన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని మున్సిపల్ కమిషనర్ కేకే కోటియాల్ తెలిపారు. Cloudburst in Uttarakhand’s Devprayag; shops, houses damaged.#TV9News #Uttarakhand pic.twitter.com/YTd9sS1Niv

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న ఎస్‌డిఆర్‌ఎఫ్ సహాయక బృందాలు అక్కడికక్కడే బయలుదేరాయి. ఇప్పటివరకు మరణాలు , గాయాల గురించి సమాచారం లేదు. కొండచరియ ఒక్కసారిగా విరిగిపడటంతో ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుతున్నాయని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఉత్తర్‌ఖండ్ సిఎం తీరత్ సింగ్ రావత్‌తో మాట్లాడి రాష్ట్రంలో వరదల వల్ల తలెత్తే పరిస్థితి గురించి ఆరా తీశారు. కేంద్రం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.