యూపీలో ఉద్రిక్తత… ఏకంగా పోలీస్ స్టేషన్‌కే నిప్పు.. రీజన్ ఏంటంటే..?
యూపీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనకారులు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మవూ జిల్లాలో సోమవారంనాడు నిరసనకారులకు, పోలీసు సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనకారులను చెదరగొడుతున్న సమయంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిస్తున్నా.. కొందరు ఆందోళనకారులు రెచ్చిపోయారు. రోడ్లపైన వాహనాలను తగులపెడుతూ.. భయానక వాతావరణాన్ని సృష్టించారు. అంతేకాదు.. ఏకంగా పోలీసులపై రాళ్లు రువ్వుతూ.. ఓ పోలీసు స్టేషన్‌కే నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితులను అదుపుచేసేందుకు.. పోలీసులు ఆందోళనకారులపై బాష్పవాయివు […]
యూపీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పలుచోట్ల ఆందోళనకారులు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మవూ జిల్లాలో సోమవారంనాడు నిరసనకారులకు, పోలీసు సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనకారులను చెదరగొడుతున్న సమయంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిస్తున్నా.. కొందరు ఆందోళనకారులు రెచ్చిపోయారు. రోడ్లపైన వాహనాలను తగులపెడుతూ.. భయానక వాతావరణాన్ని సృష్టించారు. అంతేకాదు.. ఏకంగా పోలీసులపై రాళ్లు రువ్వుతూ.. ఓ పోలీసు స్టేషన్‌కే నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితులను అదుపుచేసేందుకు.. పోలీసులు ఆందోళనకారులపై బాష్పవాయివు ప్రయోగించి, లాఠీఛార్జ్ చేపట్టారు. ఢిల్లీలోని జామియా మిలియా, యూపీలోని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులకు సంఘీభావంగానే.. ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి.
కాగా, తాజా పరిస్థితుల నేపథ్యంలో యూపీలోని పలుచోట్ల అప్రకటిత కర్ఫ్యూ విధించారు. అయితే అధికారులు మాత్రం కర్ఫ్యూ ఎక్కడా విధించలేదని, నిషేధ ఉత్వర్వులు మాత్రం కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపారు.