AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ పాక్.. జవాన్ వీరమరణం

పాకిస్థాన్ తన వక్రబుద్దిని మరోసారి ప్రదర్శిస్తోంది. గతకొద్ది రోజులుగా సైలంట్‌గా ఉందనుకున్న వేళ.. మళ్లీ సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. సోమవారం భారత్ – పాక్ నియంత్రణ రేఖ వద్ద.. పాక్ కాల్పులకు దిగింది. కశ్మీర్‌లోని బందిపొరా జిల్లా గురేజ్ సెక్టార్‌లో.. భారత సైన్యమే టార్గెట్‌గా కాల్పులకు దిగింది. అప్రమత్తమైన సైన్యం.. పాక్ చర్యలను ధీటుగా ఎదుర్కొంది. ఈ క్రమంలో పాక్ జరిపిన కాల్పుల్లో భారత జవాన్ ఒకరు వీరమరణం పొందారు. తొలుత పాక్ సైన్యమే కాల్పులు […]

మళ్లీ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డ పాక్.. జవాన్ వీరమరణం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 17, 2019 | 2:57 AM

Share

పాకిస్థాన్ తన వక్రబుద్దిని మరోసారి ప్రదర్శిస్తోంది. గతకొద్ది రోజులుగా సైలంట్‌గా ఉందనుకున్న వేళ.. మళ్లీ సరిహద్దుల్లో కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. సోమవారం భారత్ – పాక్ నియంత్రణ రేఖ వద్ద.. పాక్ కాల్పులకు దిగింది. కశ్మీర్‌లోని బందిపొరా జిల్లా గురేజ్ సెక్టార్‌లో.. భారత సైన్యమే టార్గెట్‌గా కాల్పులకు దిగింది. అప్రమత్తమైన సైన్యం.. పాక్ చర్యలను ధీటుగా ఎదుర్కొంది. ఈ క్రమంలో పాక్ జరిపిన కాల్పుల్లో భారత జవాన్ ఒకరు వీరమరణం పొందారు. తొలుత పాక్ సైన్యమే కాల్పులు జరిపి రెచ్చగొట్టారని అధికారులు వెల్లడించారు. మరోసారి ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగుతే.. గట్టి సమాధానం చెబుతామని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.

Follow Us