అనిల్‌ అంబానీకి ఊరట..చైనా బ్యాంకులకు చుక్కెదురు

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఆర్‌ కామ్‌ తీసుకున్న కార్పొరేట్‌ రుణాలకు పూచీకత్తు వివాదంలో చైనా బ్యాంకులకు చుక్కెదురైంది. ఆ సంస్థ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి బ్రిటన్‌ హైకోర్టులో ఊరట లభించింది. 680 మిలియన్‌ డాలర్ల క్లెయిమ్‌కు న్యాయస్థానం నో చెప్పింది. ఈ రుణాలను అనిల్‌ అంబానీ చెల్లించాలంటూ చైనా బ్యాంకులు వేసిన క్లెయిమ్‌ దరఖాస్తును బ్రిటన్‌ హైకోర్ట్‌ కొట్టివేసింది. తాను పూచీకత్తునిచ్చినట్లు సాక్ష్యాధారాలేమీ లేవని, విచారణ పూర్తి కాకుండానే చైనా బ్యాంకులు తనపై ఒత్తిడి చేస్తున్నాయని పిటిషన్‌ వేశారు […]

అనిల్‌ అంబానీకి ఊరట..చైనా బ్యాంకులకు చుక్కెదురు
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 17, 2019 | 12:59 PM

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఆర్‌ కామ్‌ తీసుకున్న కార్పొరేట్‌ రుణాలకు పూచీకత్తు వివాదంలో చైనా బ్యాంకులకు చుక్కెదురైంది. ఆ సంస్థ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీకి బ్రిటన్‌ హైకోర్టులో ఊరట లభించింది. 680 మిలియన్‌ డాలర్ల క్లెయిమ్‌కు న్యాయస్థానం నో చెప్పింది.

ఈ రుణాలను అనిల్‌ అంబానీ చెల్లించాలంటూ చైనా బ్యాంకులు వేసిన క్లెయిమ్‌ దరఖాస్తును బ్రిటన్‌ హైకోర్ట్‌ కొట్టివేసింది. తాను పూచీకత్తునిచ్చినట్లు సాక్ష్యాధారాలేమీ లేవని, విచారణ పూర్తి కాకుండానే చైనా బ్యాంకులు తనపై ఒత్తిడి చేస్తున్నాయని పిటిషన్‌ వేశారు అనిల్‌ అంబానీ. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అంబానీ వాదనలను పరిగణనలోకి తీసుకుంది. దీంతో చైనా బ్యాంకులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చడం సంతోషంగా ఉందని ప్రకటించారు సంస్థ ప్రతినిధులు.