Koraput SP Office: ఎస్పీ కార్యాలయంలో కాల్పుల మోత.. భయంతో పరుగులు తీసిన ఎస్పీ.. కట్ చేస్తే షాకింగ్ దృశ్యం..
అంతా ప్రశాంతంగా ఉంది. అందులోనూ ఎస్పీ ఆఫీస్‌లో ఉన్నారంటే మరింత నిశబ్దం. సరిగ్గా మధ్యాహ్నం 12 అయ్యింది. ఒక్కసారిగా తుపాకీ తూటాల మోత మోగింది. అంతే మావోయిస్టులు చొరబడ్డారు.. ఘాతుకానికి తెగబడ్డారు.. కనపడిన వారిని కాల్చేస్తున్నారు.. పారిపోండి అంటూ పెద్దపెద్ద కేకలు. ఆ మాటలతో ఎస్‌పి సహా మిగతా అందరూ..

అంతా ప్రశాంతంగా ఉంది. అందులోనూ ఎస్పీ ఆఫీస్‌లో ఉన్నారంటే మరింత నిశబ్దం. సరిగ్గా మధ్యాహ్నం 12 అయ్యింది. ఒక్కసారిగా తుపాకీ తూటాల మోత మోగింది. అంతే మావోయిస్టులు చొరబడ్డారు.. ఘాతుకానికి తెగబడ్డారు.. కనపడిన వారిని కాల్చేస్తున్నారు.. పారిపోండి అంటూ పెద్దపెద్ద కేకలు. ఆ మాటలతో ఎస్‌పి సహా మిగతా అందరూ పరుగులు తీశారు. రెండు నిమిషాల తరువాత చూస్తే ఆఫీస్ అంతా నిర్మానుష్యంగా మారింది. ఒక్కరు కూడా లేరు. అంతా టెన్సన్ టెన్సన్.. కొంతసేపటి తరువాత తేరుకొని ఒక్కొక్కరు లోపలకి వెళ్ళడం ప్రారంభించారు. అలా లోపలకి వెళ్లిన వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎస్పీ కార్యాలయంలో సిఐ గా పనిచేస్తున్న నరేంద్ర బిస్వాల్ రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నరేంద్ర బిస్వాల్ ను హుటాహుటిన అందుబాటులో ఉన్న ఆసుపత్రికి తరలించారు. మొహంపై ఎడమ వైపు రివాల్వర్ బుల్లెట్ దిగి తీవ్రంగా దెబ్బ తగిలింది. రక్తసిక్తంగా ఉన్న మొహానికి ప్రాథమిక చికిత్స చేసి, అనంతరం పరిస్థితి విషమంగా ఉందని విశాఖ సెవెన్ హిల్స్ కి తరలించారు అధికారులు.
ఆంధ్రా, ఒడిశా బోర్డర్ కోరాపుట్ ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరుపగా ఎస్పీ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ నరేంద్ర బిస్వాల్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తేల్చారు. అయితే బిస్వాల్ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏంటి అనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఆఫీసులో ఆత్మహత్యాయత్నానికి ఉన్నతాధికారుల వేధింపులు కారణమా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అని సర్వత్రా చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి ఇన్‌స్పెక్టర్ నరేంద్ర బిస్వాల్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..