విదేశాల్లో జైలు శిక్షలు అనుభవిస్తున్న భారతీయలపై స్పందించిన విదేశాంగ శాఖ.. ఏం చెప్పిందంటే
ఇండియా నుంచి ఉద్యోగం కోసమని, చదువుకోసమని చాలామంది విదేశాలకు వెళ్తుంటారు. అయితే కొందరు ఇండియన్స్ కొన్ని సమస్యల్లో ఇరుక్కుని జైలు పాలవుతుంటారు. అయితే విదేశీ జైళ్లలో మగ్గిపోతున్న వారి భారత ఖైదీల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది.

ఇండియా నుంచి ఉద్యోగం కోసమని, చదువుకోసమని చాలామంది విదేశాలకు వెళ్తుంటారు. అయితే కొందరు ఇండియన్స్ కొన్ని సమస్యల్లో ఇరుక్కుని జైలు పాలవుతుంటారు. అయితే విదేశీ జైళ్లలో మగ్గిపోతున్న వారి భారత ఖైదీల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. విదేశీ జైళ్లలో దాదాపు 8,300 మంది భారత ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పింది. ఇందులో యూఏఈ, కువైట్, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాల జైళ్లోనే ఎక్కువ మంది భారతీయలు ఉన్నట్లు తెలియజేసింది. అయితే భారత ఖైదీల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీ ధరన్ పేర్కొన్నారు.
ఖైదీలను స్వదేశానికి రప్పించేందుకు ఆ దేశ ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. గల్ఫ్ దేశాలైన కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈ లాంటి దేశాల్లోనే అత్యధికంగా 4,630 మంది భారతీయలు జైళ్లో శిక్ష అనుభవిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇందులో యూఏఈలో 1.611 మంది, సౌదీలో 1461 మంది ఖైదీలు ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఖతార్‌లో 690 మంది, నేపాల్‌లో 1222 మంది, పాకిస్థాన్‌లో 308 మంది ఉన్నట్లు తెలిపారు. చైనాలో 178 , బంగ్లాదేశ్‌లో 60, శ్రీలంకలో20 మంది జైళ్లో శిక్ష అనుభవిస్తున్నట్లు వివరించారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..