Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

China Map: మళ్లీ మ్యాప్ వివాదం.. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన డ్రాగన్

సరిహద్దు విషయంలో ఇండియాపై చైనా పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తన దుర్భుద్దిని బయటపెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను తమ భూభాగంలోనే ఉన్నట్లు చూపుతూ చైనా తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై భారత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. మళ్లీ ఇప్పుడు చైనా దీనిపై స్పందించింది. ఇదంతా కూడా చట్ట ప్రకారమేనంటూ తాము చేసినటువంటి చర్యను సమర్థించుకుంది.

China Map: మళ్లీ మ్యాప్ వివాదం.. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిన డ్రాగన్
India China Border
Follow us
Aravind B

|

Updated on: Aug 30, 2023 | 7:05 PM

సరిహద్దు విషయంలో ఇండియాపై చైనా పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తన దుర్భుద్దిని బయటపెట్టింది. అరుణాచల్‌ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను తమ భూభాగంలోనే ఉన్నట్లు చూపుతూ చైనా తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై భారత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. మళ్లీ ఇప్పుడు చైనా దీనిపై స్పందించింది. ఇదంతా కూడా చట్ట ప్రకారమేనంటూ తాము చేసినటువంటి చర్యను సమర్థించుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2023 సంవత్సారానికి సంబంధంచి చైనా సోమవారం రోజు విడుదల చేసిన స్టాండర్డ్ మ్యాప్ తీవ్ర దుమారం రేపింది. భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్ అలాగే దక్షిణ చైనా సముద్రాలను తమ దేశంలోని భూభాగాలుగా ఆ మ్యాప్‌లో పేర్కొంది.

అరుణాచల్ ప్రదేశ్ ఉన్న ప్రాంతాన్ని దక్షిణ టిబెట్‌గా పేర్కొంది. ఈ నేఫథ్యంలోనే ఈ మ్యాప్‌పై భారత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై స్పందిస్తూ సరిహద్దుల వివాదాలను మరింత రగల్చడమేనని మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే చైనా ఈ మ్యాప్‌ను తయారుచేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు దీనిపై దౌత్యపరమైన మార్గాల్లో డ్రాగన్‌కు గట్టి నిరసన వ్యక్తం చేసినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందర్ బాగ్జి తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. చైనా విడుదల చేసిన మ్యాప్ గురించి ఇండియన్ మీడియాలో వస్తున్న వార్తలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కూడా బుధవారం రోజున స్పందించారు. తమ దేశం విడుదల చేసిన 2023 స్టాండర్డ్ మ్యాప్ చట్టం ప్రకారం జరిగిందే అని తెలిపారు. ఇది దేశ సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించే సాధాపరణ ప్రక్రియ మాత్రమేనని తెలిపారు.

అలాగే దీనిపై భారత్‌ను ఉద్దేశిస్తూ సంబంధిత వర్గాలు నిష్పక్షపాతంగా పరిగణిస్తాయని.. అతిగా అర్థం చేసుకోవని ఆశిస్తున్నామని చెబుతూ మరోసారి వివిదాస్పద వ్యాఖ్యలు చేసింది. అయితే ఇప్పుడు చైనా చేసిన తాజా వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. ఇదిలా ఉండగా చైనా మ్యాప్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. చైనా దురక్రామణ విషయంలో ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. దీనిపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా స్పందించారు. చైనాకు ఇలా ఆధారాలు లేకుండా మ్యాప్‌లను విడుదల చేసే అలవాటు ఉందని.. గతంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడిందని చెప్పారు. అసంబద్ధ వాదనలు చేసి ఇతర భూభాగాలు తమవని చెప్పుకోలేరని అన్నారు. మరోవైపు భారత్‌ కొద్ది రోజుల్లో జి-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇలాంటి సమయంలో చైనా ఈ మ్యాప్‌ను విడుదల చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..