AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యకు పెళ్లి రోజు గిఫ్ట్‌గా ‘AK 47’ గన్.. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో..

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ (TMC) మాజీ నేత పీకల్లోతు వివాదంలో చిక్కుకున్నాడు. పెళ్లిరోజును పురస్కరించుకుని తన భార్యకు ఆయన ఏకే -47 గన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడమే వివాదానికి కారణం అవుతోంది. టీఎంసీ మాజీ నేత రియాజుల్ హకీ సతీమణి సబీనా యాస్మిన్ ఈ గన్‌తో పోజు ఇస్తుండగా తీసిన వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది.

భార్యకు పెళ్లి రోజు గిఫ్ట్‌గా ‘AK 47’ గన్.. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో..
Riazul Haque, Sabina Yasmin
Janardhan Veluru
|

Updated on: Aug 30, 2023 | 7:06 PM

Share

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణముల్ కాంగ్రెస్ పార్టీ (TMC) మాజీ నేత పీకల్లోతు వివాదంలో చిక్కుకున్నాడు. పెళ్లిరోజును పురస్కరించుకుని తన భార్యకు ఆయన ఏకే -47 గన్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడమే వివాదానికి కారణం అవుతోంది. టీఎంసీ మాజీ నేత రియాజుల్ హకీ సతీమణి సబీనా యాస్మిన్ ఈ గన్‌తో పోజు ఇస్తుండగా తీసిన వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తీవ్ర విమర్శలు రావడంతో రియాజుల్ ఈ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాడు.

ఈ వీడియో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర దుమారంరేపుతోంది. రాష్ట్రంలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందంటూ బీజేపీ నేతలు ధ్వతమెత్తారు. అటు సీపీఎం నేతలు కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా మారిందంటూ మమత సర్కారుపై ఫైర్ అయ్యారు. మిలిటరీ, పారామిలిటరీ ఆపరేషన్స్‌లో వాడే ఏకే 47 గన్ టీఎంసీ మాజీ నాయకుడి చేతికి ఎలా వచ్చిందో తెల్చాలని బీజేపీ, సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా రియాజుల్ ఏమి సంకేతమివ్వాలని చూస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

ఏకే 47 గన్‌తో టీఎంసీ మాజీ నేత సతీమణి..

అయితే రియాజుల్ తన చర్యను సమర్థించుకున్నారు. కేవలం ‘టాయ్ గన్‌’ను తన సతీమణికి వెడ్డింగ్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇది అసలైన గన్ కాదని.. తనపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. కేవలం బొమ్మ తుపాకీతో వీడియోలో కనిపించినందున.. ఈ విషయంలో తన భార్య తప్పు ఏమీ లేదన్నారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి రియాజుల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. రియాజుల్ టీఎంసీ‌లోని కొందరు నేతలకు అత్యంత సన్నిహితడని, ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదని స్పష్టంచేసింది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..