Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు.. మావోయిస్టులకు ఎదురు కాల్పులు.. మావోయిస్టు దళ కమాండర్ హతం
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ జిల్లాలోని చీక్‌పాల్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ...
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ జిల్లాలోని చీక్‌పాల్ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు దళ కమాండర్ ఇడుమ ముచ్చికి మృతి చెందాడు. ఘటన స్థలంలో తుపాకులు, పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ప్రాంతం మావోయిస్టులకు అడ్డాగా మారింది. ప్రతి నిత్యం ఈ ప్రాంతంలో మావోల కదలికలు అధికంగా ఉండటంతో పోలీసు బలగాలు ప్రత్యేక నిఘా పెంచారు.
మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులకు ఎదురు పడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో మావోయిస్టు కమాండర్ హతం అయ్యాడు. ఇక భారీగా రంగంలోకి దిగిన పోలీసు బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, హతమైన మావోయిస్టు దళ కమాండర్‌పై రూ.5 లక్షల రివార్డు కూడా ఉన్నట్లు దంతేవాడ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ తెలిపారు.