AB-PMJAY: ఆయుష్మాన్ భారత్.. మీ ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..?

ఆయుష్మాన్ భారత్ - ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) అనేది.. సామాన్యుల ఆరోగ్య సంరక్షణ కోసం భారత ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పథకం.. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆరోగ్య సంరక్షణ, వైద్యం, సౌకర్యాలను అందించే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు.

AB-PMJAY: ఆయుష్మాన్ భారత్.. మీ ఆరోగ్యంపై కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా..?
Ayushman Bharat Yojana
Follow us

|

Updated on: Oct 01, 2024 | 6:39 PM

ఆయుష్మాన్ భారత్ – ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY) అనేది.. సామాన్యుల ఆరోగ్య సంరక్షణ కోసం భారత ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న పథకం.. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆరోగ్య సంరక్షణ, వైద్యం, సౌకర్యాలను అందించే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ యోజన పథకాన్ని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని తక్కువ-ఆదాయ కుటుంబాల కోసం ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.. దేశంలోని దాదాపు 50 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ ఇప్పటికే కృషి చేస్తోంది.. ఇప్పుడు ప్రభుత్వం ఈ పథకం పరిధిని 70 ఏళ్లు పైబడిన వారికి కూడా విస్తరించింది. ఈ ఆరోగ్య కవరేజీ కింద ప్రజలకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్సా సౌకర్యం లభిస్తుంది.. ఇవే కాకుండా ఎయిమ్స్‌ నిర్మాణం నుంచి ఆసుపత్రుల వరకు సామాన్యుల ఆరోగ్యంపై ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తోంది. అయితే.. మీ ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా? తెలియకపోతే ఈ గణాంకాలను చూడండి..

సామాన్యుల ఆరోగ్యంపై ఎక్కువ ఖర్చు..

తాను కష్టపడి సంపాదించిన డబ్బు కంటే సామాన్యుడి ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.. ఈ ఏడాది సెప్టెంబరు 25 వరకు ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యంపై మొత్తం రూ.100 ఖర్చు చేస్తే.. ఆ వ్యక్తి జేబులో పెట్టే ఖర్చు రూ.39.4 మాత్రమే. కాగా ప్రభుత్వ వ్యయం దాదాపు రూ.48.. ఈ విధంగా సామాన్యుల ఆరోగ్యంపై ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ప్రజాధనం కంటే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంటున్నాయి.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు..

Health Data

సామాన్యుల ఆరోగ్యంపై ప్రభుత్వం చేసే ఖర్చు వివరాలు

2013-14 సంవత్సరంలో దేశంలో సామాన్యుల ఆరోగ్య వ్యయం 64.2 శాతం కాగా, ప్రభుత్వ వ్యయం 28.6 శాతం.. ఇందులో ప్రభుత్వ వ్యయం ఏడాదికేడాది పెరిగిపోగా, సామాన్యుల జేబులో ఖర్చు తగ్గింది. 2017-18 సంవత్సరానికి, ఇది దాదాపు సమానంగా మారింది. ప్రభుత్వ వ్యయం 40.8 శాతానికి పెరగగా, సామాన్యుల వ్యయం 48.8 శాతానికి పడిపోయింది. 2021-22లో తొలిసారిగా ఆరోగ్యంపై సామాన్యుల వ్యయం 39.4 శాతంగా ఉండగా, ప్రభుత్వ వ్యయం 48 శాతానికి పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి..

మూడు రెట్లు పెరిగిన వ్యయం..

Data Health

సామాన్యుల ఆరోగ్యంపై ప్రభుత్వం చేసే ఖర్చు వివరాలు

ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రభుత్వ తలసరి ఆరోగ్య వ్యయం దాదాపు 3 రెట్లు పెరిగింది. 2013-14 సంవత్సరంలో ప్రభుత్వం తలసరి ఆరోగ్య వ్యయం రూ.1,042. కాగా 2021-22 నాటికి రూ.3,169గా ​​మారింది. ప్రభుత్వ ఆరోగ్య వ్యయం ఇంతగా పెరగడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి.. కాగా, శాతంలో సామాన్యుడి వ్యక్తిగత వ్యయం కంటే ఎక్కువగా పెరిగినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..