AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bullet Train: ‘2 గంటల్లో 500 కి.మీల ప్రయాణం’.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి

భారత దేశంలో తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ త్వరలోనే అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడర్‌ పేరుతో తొలి బుల్లెట్ ట్రైన్‌ సేవలు అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే...

Bullet Train: '2 గంటల్లో 500 కి.మీల ప్రయాణం'.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన కేంద్ర మంత్రి
Representative Image
Narender Vaitla
|

Updated on: Feb 13, 2024 | 8:00 AM

Share

ఇండియన్‌ రైల్వే ముఖచిత్రం మారుతోంది. హైస్పీడ్‌, అధునాతన సౌకర్యాలతో కూడిన రైళ్లు పట్టాలెక్కుతున్నాయి. వందే భారత్‌ రైళ్లతో దీనికి పునాది పడగా, బుల్లెట్‌ ట్రైన్‌తో మరో అడుగు ముందుకు పడనుంది. ఇప్పటి వరకు కేవలం అగ్ర రాజ్యాలకే పరిమితమైన బుల్లెట్‌ రైళ్లు భారత్‌లో పరుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

భారత దేశంలో తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ త్వరలోనే అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడర్‌ పేరుతో తొలి బుల్లెట్ ట్రైన్‌ సేవలు అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన బ్రిడ్జిలను దాదాపు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ‘ఎక్స్‌’ (ట్విట్టర్‌) వేదకగా పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

భారతీయ రైల్వే ముఖచిత్రం ఎంతలా మారనుంది అనడానికి ఈ వీడియో అద్దం పడుతోంది. తమ ప్రభుత్వం కలలను కాదు, వాస్తవాలను సృష్టిస్తోంది అంటూ అశ్వినీ వైష్ణవ్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు. అంతేకాకుండా ప్రధాని మోదీ మూడో పాలనలలో ‘బుల్లెట్‌ రైలు’ కోసం ఎదురు చూడండి అంటూ పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం ఈ బుల్లెట్ ట్రైన్‌.. గంటకు గరిష్ఠంగా 320 కి.మీల మెరుపు వేగంతో దూసుకుపోనుంది, అలాగే.. రెండు గంటల్లో 508 కిమీ ప్రయాణించనుంది.. నదులపై 24 వంతెనలు నిర్మించనున్నట్లు స్పష్టమవుతోంది.

మంత్రి షేర్ చేసిన వీడియో..

అంతేకాకుండా దేశంలోని తొలిసార స్లాబ్‌ ట్రాక్‌ సిస్టమ్‌, భూకంపాలను ముందుగానే గుర్తించేలా ఏర్పాట్లు, 28 స్టీలు వంతెనలు, ఏడు సొరంగాలు, సముద్ర గర్భంలో ఏడు కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌, అత్యాధునిక సదుపాయలతో కూడిన 12 రైల్వే స్టేషన్లతో పాటు ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలకు నెలవు ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌. సుమారు రూ. 1.08 లక్షల కోట్లతో ఈ ప్రాజెక్టునుచేపట్టారు. 2026లో ఈ రైలు మొదటి ట్రయల్‌ రన్‌ను చేపట్టనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..