ఇతిహాసాలపై ప్రైవేటు స్కూల్ టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆపై నిరసన జ్వాలలు.. చివరికి.!

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్లు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశమవుతున్నారు. పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను వక్రీకరిస్తూ వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ టీచర్ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం లాంటివి కేవలం కల్పితాలు అంటూ కామెంట్స్ చేసింది.

ఇతిహాసాలపై ప్రైవేటు స్కూల్ టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఆపై నిరసన జ్వాలలు.. చివరికి.!
School
Follow us

|

Updated on: Feb 13, 2024 | 12:38 PM

పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్లు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశమవుతున్నారు. పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను వక్రీకరిస్తూ వివాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ టీచర్ ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం లాంటివి కేవలం కల్పితాలు అంటూ కామెంట్స్ చేసింది. ఆమె తీరు కారణంగా పాఠశాల యాజమాన్యం సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన కర్ణాటకాలోని మంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మహాభారతం, రామాయణంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో అల్లర్లు, నిరసనలు జరిగాయి. ఫలితంగా కర్ణాటకలోని మంగళూరులోని ఒక పాఠశాల నుండి టీచర్ ను తొలగించారు. కోస్టల్ టౌన్‌లోని సెయింట్ గెరోసా ఇంగ్లీష్ హెచ్‌ఆర్ ప్రైమరీ స్కూల్‌కు చెందిన టీచర్ మహాభారతం, రామాయణం “కల్పితం” అని విద్యార్థులకు బోధించడం వివాదస్పదంగా మారింది. ఈ విషయపై ఏకంగా స్తానిక బిజెపి ఎమ్మెల్యే వేద్యస్ కామత్ మండిపడ్డారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కూడా టీచర్ మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీకి వ్యతిరేకంగా 2002 గోద్రా అల్లర్లు, బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసును టీచర్ విద్యార్థుల వద్ద ప్రస్తావించారని తెలుస్తోంది. ఆమె “పిల్లల మనస్సులలో ద్వేష భావాలను ప్రేరేపించడానికి” ప్రయత్నిస్తోందని ఫిర్యాదులు వినిపించాయి. టీచర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా నిరసనలు చేపట్టారు.  ఇవాళ ఎమ్మెల్యే సైతం నిరసన కార్యక్రమాల్లో పాల్గొని టీచర్ వ్యాఖ్యలను ఖండించారు.

“అలాంటి టీచర్స్ కు మద్దతు ఇవ్వడం పాఠశాల యజమాన్యం తప్పు అని? ఆ టీచర్‌ని విధుల్లో ఎందుకు కొనసాగిస్తున్నారని?  ఎమ్మెల్యేతో పాటు స్థానికులు ప్రశ్నించారు. మీరు ఆరాధించే జీసస్ శాంతిని కోరుకుంటాడు. మీ సోదరీమణులు మా హిందూ పిల్లలను తప్పుదారి పట్టించవద్దు. ఎవరైనా మీ నమ్మకాన్ని అవమానిస్తే మేం మౌనంగా ఉండరు” అని బీజేపీ ఎమ్మెల్యే స్కూల్ యాజమాన్యాని ఉద్దేశించి మండిపడ్డారు.

డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ (డీడీపీఐ) కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపించిన వ్యాఖ్యలపై పాఠశాల ఉపాధ్యాయుడిని తొలగించింది. “సెయింట్ గెరోసా పాఠశాలకు 60 సంవత్సరాల చరిత్ర ఉంది.  ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన ఏదీ జరగలేదు. తాజాగా ఘటనతో స్కూల్ లో గందరగోళం నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఆమెపై ఎలాంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు కాలేదు.