AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: దేశ రాజధానిలో హై అలర్ట్‌.. ఢిల్లీకి పయనమైన 20 వేల మంది రైతులు..

పంటకు కనీస మద్దతు ధరపై భరోసా కల్పించాంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, పంటరుణాలు మాఫీ చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై...

Delhi: దేశ రాజధానిలో హై అలర్ట్‌.. ఢిల్లీకి పయనమైన 20 వేల మంది రైతులు..
Delhi
Narender Vaitla
|

Updated on: Feb 13, 2024 | 12:40 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రైతుల ఛలో ఢిల్లీ కార్యక్రమం నేపత్యంలో హస్తిన దిగ్బంధనమైంది. రైతుల ధర్నాను భగ్నం చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రమంత్రుల బృందంతో చర్చలు విఫలం కావడంతో.. ఉద్యమానికి సై అంటున్నారు రైతులు. ఉత్తరాదిలోని మూడు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 20 వేల మంది రైతులు ఛలో ఢిల్లీ చేపట్టారు. 2021 నాటి రైతుల ఉద్యమాన్ని తలపిస్తోంది ఛలో ఢిల్లీ. మళ్లీ ఉద్రిక్తతకు చోటివ్వకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు పోలీసులు.

పంటకు కనీస మద్దతు ధరపై భరోసా కల్పించాంటూ రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని, పంటరుణాలు మాఫీ చేయాలని, రైతులకు, రైతు కూలీలకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతులపై కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

అయితే రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణకు కేంద్ర మంత్రుల బృందం సరేనంది. నాటి పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పరిహారం విషయంలో కూడా సానుకూలంగా స్పందించింది. మినిమమ్ సపోర్ట్ ప్రైస్.. MSPకి చట్టబద్ధత కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌ దగ్గరే పీటముడి పడింది. ప్రభుత్వం ససేమిరా అనడంతో ‘ఢిల్లీ చలో’కి నడుం బిగించాయి రైతు సంఘాలు.

ఇదిలా ఉంటే రైతులు చేపట్టిన ఛలో ఢిల్లీ ప్రభావంతో దేశ రాజధాని నగరంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. రహదారుల దగ్గర పోలీసుల మోహరింపుతో.. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. అతినిదానంగా వాహనాలు కదులుతుండడంతో.. కిలో మీటర్‌ దూరం దాటేందుకు గంటల సమయం పడుతోంది. రైతుల మెగా మార్చ్‌ను భగ్నం చేసేందుకు.. ఢిల్లీకి దారి తీసే ప్రధాన సరిహద్దుల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సింగూ, టిక్రిలతో పాటు ఢిల్లీ(ఘజియాబాద్‌), యూపీ నొయిడాల సరిహద్దు ప్రాంతాలైన ఘాజిపూర్‌, చిల్లా వద్ద పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అయితే పోలీసులు మాత్రం దారుల్ని పూర్తిగా మూసేయలేదని.. ఫెన్సింగ్‌లో పాక్షికంగా మూసేసి తనిఖీల అనంతరం అనుమతిస్తున్నామని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..