Nipah Virus: నిఫా నియంత్రణకు నిధులు ప్రకటించిన కేంద్రం.. తక్షణ చర్యలు చేపట్టాలంటూ రూ.100 కోట్లు..
Nipah Virus: నిఫా వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ఆరోగ్య శాఖ రూ.100 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కేరళలలోని వివిధ జిల్లాలలో ఉన్న లేబరేటరీలకు ఈ నిధులు విడుదల చేస్తూ వైరస్‌ను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయా శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ..
Nipah Virus: కేరళలో వరుస మరణాలతో కలకలం రేపుతున్న నిఫా వైరస్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే వైరస్ నియంత్రణ కోసం కేంద్ర ఆరోగ్య శాఖ రూ.100 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. కేరళలలోని వివిధ జిల్లాలలో ఉన్న లేబరేటరీలకు ఈ నిధులు విడుదల చేస్తూ వైరస్‌ను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయా శుక్రవారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. వైరస్ నిర్ధారణ పరీక్షలతో పాటు నిఫా బాధితులకు అవసరమైన చికిత్స అందించడం, వైరస్ నియంత్రణ చర్యలకు ఈ రూ. 100 కోట్ల నిధులను ఉపయోగించాలని అధికారులకు మంత్రి సూచించారు.
అలాగే కరోనా మహమ్మారి వ్యాప్తితో కేంద్ర ఆరోగ్య శాఖ చాలా పటిష్ఠంగా తయారైందని, దేశంలోని ఏ మారుమూల పల్లెలో ఎలాంటి వైరస్ బయటపడినా వెంటనే తెలుసుకునేలా ఏర్పాట్లు చేశామని మంత్రి మాండవీయా పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ కమాండ్ సిస్టమ్ ద్వారా వైరస్ ఉనికిని వెంటనే తెలుసుకోగలుగుతున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. కేరళలో నిఫా వైరస్ నియంత్రణకు జిల్లా స్థాయిలో ఇప్పటికే ఉన్న అన్ని ల్యాబ్‌లకు అదనంగా మరిన్ని కొత్త ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కేరళలో తాజాగా మరొకరికి నిఫా వైరస్ సోకినట్లుగా గుర్తించామని ఆరోగ్య మంత్రి మాండవీయ తెలిపారు. దీంతో కేరళలో నిఫా బాధితుల సంఖ్య 6 కు చేరిందని అన్నారు. వైరస్ బారిన పడి ఇప్పటికే ఐదుగురు చనిపోయారని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిఫా వైరస్ నియంత్రణకు మెరుగైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైరస్ కేసులు బయటపడ్డ గ్రామాలతో పాటు చుట్టుపక్కల తొమ్మిది గ్రామాల్లో కంటైన్‌మెంట్ ప్రకటించామని మంత్రి మాండవీయా చెప్పారు. వైరస్ వ్యాప్తి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్‌గా ఉన్నాయని, ప్రజలు భయాందోళనలకు లోనవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి ధైర్యం చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..