Azadi Ka Amrit Mahotsav: మీకు మూవీ మేకింగ్‌లో ఆసక్తి ఉందా.? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ అద్భుత అవకాశం మీకోసమే..
Azadi Ka Amrit Mahotsav: మీకు ఫిలిమ్ మేకింగ్‌లో ఆసక్తి ఉందా.? ఒక్క చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారా.? ఈ ప్రపంచానికి మీ ప్రతిభను పరిచయం చేయాలనుకుంటున్నారా.? అయితే మీలాంటి వారి కోసమే..
Azadi Ka Amrit Mahotsav: మీకు ఫిలిమ్ మేకింగ్‌లో ఆసక్తి ఉందా.? ఒక్క చాన్స్ కోసం ఎదురు చూస్తున్నారా.? ఈ ప్రపంచానికి మీ ప్రతిభను పరిచయం చేయాలనుకుంటున్నారా.? అయితే మీలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఓ అద్భుత అవకాశాన్ని తీసుకొచ్చింది. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కేంద్రం ప్రభుత్వం ’75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో’ పేరుతో ఓ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా ఔత్సాహిక ఫిలిమ్ మేకర్స్ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. డైరెక్షన్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్ రికార్డింగ్, యాక్టింగ్, ప్లేబ్యక్ సింగింగ్, ప్రొడక్షన్ డిజైన్ లేదా స్క్రిప్ట్ రైటింగ్‌లో ఆసక్తి ఉన్న వారు ఇందలో పాల్గొనవవచ్చు. ఈ విషయాన్ని కేంద్ర ఐ అండ్ బీ, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దరఖాస్తుల స్వీకరణ రేపటితో (అక్టోబర్ 30) ముగియనున్నాయి. అప్లికేషన్స్ పంపించిన వారిలో 75 మందిని ఎంపిక చేసి గోవాలో జరగనున్న 52వ ఇంటర్‌నేషనల్ ఫిలిమ్ ఫెస్టివిల్‌లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.
ఇందులో పాల్గొనాలనుకునే వారు కచ్చితంగా భారతీయులై ఉండాలి. అభ్యర్థలు పంపించే వీడియో 5 నిమిషాల కంటే తక్కువ 10 నిమిషాలు మించకుండ ఉండాలి. షార్ట్‌ఫిలిమ్‌ను ఆయా భాషల్లో రూపొందించినప్పటికీ ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. అభ్యర్థుల వయసు 01-10-2021 నాటికి 35 ఏళ్లు మించకూడదు. అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా https://www.dff.gov.in/ వెబ్‌సైట్‌లోని ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని పూర్తివివరాలను నింపి india75.iffi@gmail.com మెయిల్ ఐడీకి పంపించాలి.
?️’75 ???????? ????? ?? ????????’
Are you into Direction, Editing, Cinematography, Sound Recording, Acting,Playback Singing, Production Design or Scriptwriting?
A unique opportunity to participate @IFFIGoa & attend masterclasses??https://t.co/zvW9gKnwWd pic.twitter.com/w644GZz0vH
— Anurag Thakur (@ianuragthakur) October 29, 2021