Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Hackathon 2021: విద్యార్థుల కోసం ఆధార్ హ్యాకథాన్ 2021.. గెలుపొందితే రూ.3 లక్షల నగదు బహుమతి..!

Aadhaar Hackathon 2021:  యూఐడీఏఐ ఆధార్‌ కార్డులను జారీ చేయడమే కాదు.. అప్పుడప్పుడు వివిధ రకాల కార్యక్రమాలు..

Aadhaar Hackathon 2021: విద్యార్థుల కోసం ఆధార్ హ్యాకథాన్ 2021.. గెలుపొందితే రూ.3 లక్షల నగదు బహుమతి..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 29, 2021 | 9:57 PM

Aadhaar Hackathon 2021:  యూఐడీఏఐ ఆధార్‌ కార్డులను జారీ చేయడమే కాదు.. అప్పుడప్పుడు వివిధ రకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటుంది. అందులో విజేతలకు నిలిచిన వారికి బహుమతులు కూడా అందిస్తుంటుంది ఆధార్‌ సంస్థ. ప్రస్తుతం అన్నింటికి ఆధారమే ఆధార్‌ కార్డు. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ తీపి కబురు అందించింది. తాజాగా ఉచితంగానే రూ.3 లక్షల వరకు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. దీని కోసం ఆధార్ హ్యాకథాన్ నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ప్రైజ్ మనీ ప్రకటించింది.

ఈ ఆధార్‌ హ్యాకథాన్‌ అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 31 వరకు ఉంటుందని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ తెలిపింది. అయితే https://hackathon.uidai.gov.in/ వెబ్‌ సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. సమస్యలకు సాంకేతికత ద్వారా పరిష్కారం లక్ష్యంగా ఆధార్ ఈ హ్యాకథాన్‌ను నిర్వహిస్తోంది. అయితే ఇది అందరికి కాదు. ఈ హ్యాకథాన్‌లో ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని విద్యార్థులు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆధార్‌ హ్యాకథాన్‌ 2021 సాంకేతికత సమస్యల పరిష్కారానికై ఆధార్‌ బృందం నిర్వహిస్తున్న మొట్టమొదటి కార్యక్రమం. కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేసింది.

ఎన్‌రోల్‌మెంట్ అండ్ అప్‌డేట్, ఐడెంటిటీ అండ్ అథంటికేషన్ వంటి థీమ్స్ ఆధారంగా హ్యాకథాన్ ఉంటుంది. ఐదుగురుగా ఒక టీమ్‌గా ఏర్పడవచ్చు. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరి.

విజేతలకు నగదు బహుమతులు..

ఈ ఆధార్‌ హ్యాకథాన్‌లో విజేతకు రూ.3 లక్షలు, రన్నర్‌గా నిలిచిన వారికి రూ.2 లక్షలు వస్తాయి. ఇక తర్వాత రెండు టీమ్స్‌కు రూ.లక్ష అందజేస్తారు. అంతేకాకుండా ఆధార్ 2.0 గ్లోబల్ కాన్ఫరెన్స్‌కు ఈ టీమ్స్‌కు ఇన్విటేషన్ ఉంటుంది. అంతేకాకుండా సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. ఇందులో పాల్గొనే ఇంజనీరింగ్‌ విద్యార్థులు.. రెండు టీమ్‌లతో ముందుకు వస్తారు. సాంకేతికంగా ఏర్పడే సమస్యలను పరిష్కార మార్గాలను వీరు అన్వేషిస్తారు. ఆధార్‌ చిరునామాను అప్‌డేట్‌ చేసేటప్పుడు సామాన్యుడు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తిస్తారు.

ఇవి కూడా చదవండి:

Indian Railways: గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి వచ్చిన ఎకానమీ AC-3 టైర్‌ రైళ్లు.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే..

EPF: ఉద్యోగులకు కేంద్రం దీపావళి కానుక.. 6 కోట్ల మంది పీఎఫ్‌ ఖాతాదారులకు అదిరిపోయే బెనిఫిట్‌..!