AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోర్న్ సైట్లపై కేంద్రం కొరడా.. 67 సైట్లపై నిషేధం.. వెంటనే అమలు చేయాలని ఆదేశం

ఇంటర్నెట్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడం, సెల్ ఫోన్ అందరికీ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాలో గడిపేస్తున్న వారు ఎందరో. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు అందులోనే తల దూర్చుతున్నారు....

పోర్న్ సైట్లపై కేంద్రం కొరడా.. 67 సైట్లపై నిషేధం.. వెంటనే అమలు చేయాలని ఆదేశం
Adult Content
Ganesh Mudavath
|

Updated on: Sep 30, 2022 | 1:55 PM

Share

ఇంటర్నెట్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడం, సెల్ ఫోన్ అందరికీ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియాలో గడిపేస్తున్న వారు ఎందరో. ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు అందులోనే తల దూర్చుతున్నారు. ఇక పిల్లల చేతికి ఎప్పుడైతే ఫోన్లు వచ్చాయో ఇక వారిని ఆపడం ఎవరి వల్లా కావడం లేదు. టీనేజీ వయసులో ఉన్న పిల్లలు ఫోన్ లో ఏం చూస్తున్నారో.. ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. అసలే ఆకర్షణలకు గురయ్యే వయసు. ఆ సమయంలో అడల్ట్ కంటెంట్ వారి కంటికి కనిపిస్తే.. ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ.. ఇంటర్నెట్ లో రకరకాల పోర్న్ సైట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటిని చూసేందుకు అలవాటు పడిన చిన్నారులు చివరకు బానిసలుగా మారుతున్నారు. అందుకే వాటిని నియంత్రించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న 67 అశ్లీల వెబ్ సైట్లను కేంద్రం నిషేధించింది.

ఇంటర్నెట్ లో విచ్చలవిడిగా పెరిగిపోతున్న అశ్లీల వెబ్ సైట్ లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. గురువారం 67 శృంగార సైట్‌లపై నిషేధం విధించింది. ఆ వెబ్‌సైట్‌లను వెంటనే బ్లాక్‌ చేయాలని ఇంటర్నెట్ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆదేశాల్లో వెల్లడించింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలతోపాటు పుణె ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాల మేరకు 63 వెబ్‌సైట్లను, ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాల ఆధారంగా 4 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని స్పష్టం చేసింది. అయితే ఇటీవలే అసత్య వార్తలు, విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న యూట్యూబ్‌ ఛానెళ్లు, మార్ఫింగ్‌ వీడియోల పై కూడా కేంద్రం నిషేధం విధించింది. ఇప్పటికే 10 యూట్యూబ్‌ ఛానెళ్లకు సంబంధించిన 45 వీడియోలను బ్లాక్‌ చేసింది. అగ్నిపథ్‌, కశ్మీర్‌, ఆర్మీ అంశాలపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

గతేడాది ప్రకటించిన ఐటీ చట్టం గైడ్ లైన్స్ ను పట్టించుకోకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 67 వెబ్ సైట్లు అశ్లీల వీడియోలను నిర్వహిస్తున్నట్టుగా పుణె కోర్టు, ఉత్తరాఖండ్ హై కోర్టుల నుంచి కేంద్రానికి వేర్వేరుగా ఆదేశాలు అందాయి. మహిళలు, చిన్నారుల మానానికి, గౌరవానికి భంగం కలిగించేలా పోర్నోగ్రఫిక్ వెబ్‌సైట్లపై నిషేధం విధించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి జాబితా అందింది. వీటిలో 63 వెబ్‌సైట్ల జాబితాను పూణె కోర్టు అందివ్వగా, మరో నాలుగు వెబ్‌సైట్ల పేర్లతో కూడిన జాబితాను ఉత్తరాఖండ్ హైకోర్టు అందజేసింది. గతంలోనూ అనేక సందర్భాల్లో పోర్నోగ్రఫిక్ కాంటెంట్‌ని ప్రోత్సహించే బూతు వెబ్‌సైట్ల భరతం పడుతూ కేంద్రం కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి