బస్సు, ట్రక్కు ఢీ.. ఏడుగురు కూలీల మృతి.. ఏడుగురికి గాయాలు

ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ‌ధాని రాయ్‌పూర్ స‌మీపంలో ప్ర‌మాదంలో ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. బస్సు,ట్రక్కు ఢీకొన్న ప్ర‌మాదంలో ఏడుగురు కూలీలు మ‌ర‌ణించ‌గా, మ‌రో ఏడుగురు తీవ్రంగా గాయ‌పడ్డారు.

బస్సు, ట్రక్కు ఢీ.. ఏడుగురు కూలీల మృతి.. ఏడుగురికి గాయాలు
Balaraju Goud

|

Sep 05, 2020 | 9:42 AM

ఛ‌త్తీస్‌గ‌ఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ‌ధాని రాయ్‌పూర్ స‌మీపంలో ప్ర‌మాదంలో ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. బస్సు,ట్రక్కు ఢీకొన్న ప్ర‌మాదంలో ఏడుగురు కూలీలు మ‌ర‌ణించ‌గా, మ‌రో ఏడుగురు తీవ్రంగా గాయ‌పడ్డారు. ఓ ప్రైవేటు బ‌స్సు ఒడిశాలోని గంజామ్ నుంచి గుజ‌రాత్‌లోని సూరత్‌కు కూలీల‌తో వెళ్తోంది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ఛేరీ ఖేడీ వ‌ద్ద శనివారం తెల్ల‌వారుజామున‌ ఓ ట్ర‌క్కును, ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. దీంతో ఏడుగురు వ్యక్తులు అక్కడిక్కడే మ‌ర‌ణించ‌గా, మ‌రో ఏడు‌గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని రాయ్‌పూర్ ఎస్పీ అజ‌య్ యాద‌వ్ వెల్ల‌డించారు. క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ నిద్రమత్తు కారణంగా భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లాక్‌డౌన్‌కు ముందు వీరంతా సూర‌త్‌లో ప‌నిచేశార‌ని, క‌రోనా నేప‌థ్యంలో స్వ‌స్థ‌లాల‌కు వెళ్లార‌ని చెప్పారు. మ‌ళ్లీ ఉపాధి కోసం సూర‌త్ వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రి‌గినట్లు పోలీసులు వెల్ల‌డించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu