భారత్‌లోకి చొరబడేందుకు 26 మంది ప్రయత్నం.. అరెస్ట్ చేసిన బీఎస్ఎఫ్

భారత్ లోకి చోరబడేందుకు యత్నించిన వారిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సమర్థవంతంగా ఎదుర్కొంది. బంగ్లాదేశ్‌కు చెందిన 26 మంది పౌరులు.. వెస్ట్ బెంగాల్‌లోని గోనా ఫీల్డ్ సరిహద్దుల వద్ద చొరబడేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించింది. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గత కొంతకాలంగా వెస్ట్ బెంగాల్ బార్డర్ గుండా అక్రమ చొరబాట్లు పెరిగాయన్న వార్తలతో బీఎస్ఎఫ్ అప్రమత్తంగా ఉంది. గతంలో రోహింగ్యాలు […]

భారత్‌లోకి చొరబడేందుకు 26 మంది ప్రయత్నం.. అరెస్ట్ చేసిన బీఎస్ఎఫ్
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2019 | 1:47 PM

భారత్ లోకి చోరబడేందుకు యత్నించిన వారిని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సమర్థవంతంగా ఎదుర్కొంది. బంగ్లాదేశ్‌కు చెందిన 26 మంది పౌరులు.. వెస్ట్ బెంగాల్‌లోని గోనా ఫీల్డ్ సరిహద్దుల వద్ద చొరబడేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించింది. దీంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గత కొంతకాలంగా వెస్ట్ బెంగాల్ బార్డర్ గుండా అక్రమ చొరబాట్లు పెరిగాయన్న వార్తలతో బీఎస్ఎఫ్ అప్రమత్తంగా ఉంది. గతంలో రోహింగ్యాలు కూడా ఇదే ప్రాంతం గుండా దేశంలోకి చొరబడ్డారు.