ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేసినందుకు పోలీసుల నోటీసులు !

పెళ్లిళ్ల ట్రెండ్‌ మారింది…ఒకప్పుడు 16 రోజుల పెళ్లిల్లు జరిగేవట. తర్వాత తర్వాత ఐదు రోజుల పెళ్లిళ్లు..ప్రస్తుత కాలంలో..ఒకే రోజు పెళ్లి కూడా జరిపించేస్తున్నారు. ఇక ఎటువంటి వెడ్డింగ్‌ అయినా సరే..ముందుగా ప్రీ వెడ్డింగ్ షూట్‌ నిర్వహించడం ప్రజెంట్‌ ట్రెడ్డింగ్‌ అయిపోయింది. ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ను చేసుకుంటారు. ఈ షూట్‌ పది కాలాల పాటు గుర్తుండేలా తమ ప్రేమనంతా అందులో ప్రతిబింబింప జేసేలా ఉంటుంది. కొంతమంది అయితే తమ నిజ జీవితంలో ఇలా […]

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేసినందుకు పోలీసుల నోటీసులు !
Follow us

|

Updated on: Aug 27, 2019 | 6:49 PM

పెళ్లిళ్ల ట్రెండ్‌ మారింది…ఒకప్పుడు 16 రోజుల పెళ్లిల్లు జరిగేవట. తర్వాత తర్వాత ఐదు రోజుల పెళ్లిళ్లు..ప్రస్తుత కాలంలో..ఒకే రోజు పెళ్లి కూడా జరిపించేస్తున్నారు. ఇక ఎటువంటి వెడ్డింగ్‌ అయినా సరే..ముందుగా ప్రీ వెడ్డింగ్ షూట్‌ నిర్వహించడం ప్రజెంట్‌ ట్రెడ్డింగ్‌ అయిపోయింది. ఎవరికి నచ్చిన విధంగా వాళ్లు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ను చేసుకుంటారు. ఈ షూట్‌ పది కాలాల పాటు గుర్తుండేలా తమ ప్రేమనంతా అందులో ప్రతిబింబింప జేసేలా ఉంటుంది. కొంతమంది అయితే తమ నిజ జీవితంలో ఇలా చేయాలి, అలా చేయాలి అని కలలు కంటుంటారు.. ఆ కలలన్నింటిని ఇలా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ రూపంలో నెరవేర్చుకుంటారు. అయితే ఓ పోలీస్‌ ఆఫీసర్‌ కూడా తన నిజ జీవితానికి దగ్గరగా ఉండే ఓ సన్నివేశాన్ని ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

రాజస్థాన్‌ చితోర్‌ఘర్‌ జిల్లాలోని మంద్‌ఫియా పోలీస్‌ స్టేషన్‌లో ధనపాట్‌ అనే వ్యక్తి స్టేషన్‌ హౌస్‌ అధికారిగా పనిచేస్తున్నాడు. అతనికి ఈ మధ్యనే పెళ్లి కుదిరింది. అయితే ఆ ఆఫీసర్‌ తన పెళ్లికి సంబంధించి ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ను చేయించుకున్నాడు. అందులో తమ ప్రేమను వినూత్నంగా వ్యక్తీకరించారు. ధన్‌పాట్‌ విధుల్లో ఉండగా..అటు నుంచి ఓ యువతి హెల్మెట్‌ లేకుండా వాహనాన్ని నడుపుకుంటూ వస్తోంది. ఈ విషయాన్ని గమనించిన పోలీసు ఆమెను ఆపి వెహీకిల్‌ కీ తీసుకుంటాడు. వెంటే ఆమె పోలీసు ఆఫీసర్‌ ధన్‌పాట్‌ దగ్గరకు వెళ్లి అతని జేబులో రూ. 500లు లంచంగా పెట్టి..వెనుక జేబులో ఉన్నఅతని పర్స్‌ను దొంగలిస్తోంది. అది గమనించని సదరు ఆఫీసర్‌ ఆమె ఇచ్చిన కరెన్సీనోటును వాస చూస్తూ..ఊహా లోకంలో విహరిస్తాడు.. తర్వాత తన పర్స్‌ మిస్‌ అయిన సంగతి తెలుసుకుని..పర్సు ఎలా పోయిందనే విషయాన్ని గమనిస్తాడు.. అలా సీన్‌ మొత్తం ఓ సారి గుర్తు చేసుకుంటే.. అది ఆ అందమైన అమ్మాయి పనిగా తెలుసుకుంటాడు..పర్సు కోసం ఆమెను మళ్లీ కలుస్తాడు..అలా వాళిద్దరూ ప్రేమలో పడతారు..అలా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ఓ తీయని స్వప్నంలా జరిగిపోయింది.

ఇంతవరకు బాగానే ఉంది..కానీ తన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ధనపాల్‌ను పోలీసులకు పట్టించింది. పోలీస్‌ యూనిఫామ్‌లో ప్రీ వెడ్డింగ్‌ షుట్‌ చేయడమే కాకుండా.. లంచం ఇచ్చే సీన్‌ చూపించినందుకు ఆ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. పోలీసు అధికారి స్థాయిలో ఉండి చేసే ఇటువంటి పనులు సమాజంలో తప్పుడు సంకేతాలను తీసుకెళ్తాయని సూచించారు. ఇందుకు జరిమానాగా ధన్‌పాట్‌పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారు నోటీసులు జారీ చేశారు