భారత్​పై దాడులకు పాక్​ కుట్ర..అప్రమత్తమైన సైన్యం

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. భారత్​-పాక్​ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి కూడా పాక్‌కు షాక్ ఇచ్చింది. పెద్దన్న అమెరికా కూడా ఏమీ మాట్లాడకుండా నిమ్మకుండిపోయింది. ఈ నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ వరుస​ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా నియంత్రణ రేఖ వెంట భారీగా ఎస్​ఎస్​జీ కమాండోలను మోహరించింది. అప్రమత్తమైన భారత సైన్యం ఈ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తోంది. కాల్పుల విరమణ ఉల్లంఘనలో క్రియాశీలకంగా పాల్గొంటున్న పాకిస్థాన్​ సైన్యం ఎస్​ఎస్​జీ కమాండోలు అనేకమంది […]

భారత్​పై దాడులకు పాక్​ కుట్ర..అప్రమత్తమైన సైన్యం
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Aug 27, 2019 | 9:16 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. భారత్​-పాక్​ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి కూడా పాక్‌కు షాక్ ఇచ్చింది. పెద్దన్న అమెరికా కూడా ఏమీ మాట్లాడకుండా నిమ్మకుండిపోయింది. ఈ నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ వరుస​ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా నియంత్రణ రేఖ వెంట భారీగా ఎస్​ఎస్​జీ కమాండోలను మోహరించింది. అప్రమత్తమైన భారత సైన్యం ఈ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తోంది.

కాల్పుల విరమణ ఉల్లంఘనలో క్రియాశీలకంగా పాల్గొంటున్న పాకిస్థాన్​ సైన్యం ఎస్​ఎస్​జీ కమాండోలు అనేకమంది గాయాలపాలయ్యారు. భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టడమే ఇందుకు కారణం. ఈ కక్షతోనే భారత్​కు గట్టి బదులిచ్చే దిశగా పాక్​ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

పాకిస్థాన్​ భూభాగంలోని సర్​ క్రీక్​ ప్రాంతంలో భారీగా ఎస్​ఎస్​జీ​ కమాండోలు మోహరించినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ సారి కశ్మీరీలకు బదులు 12 మంది అఫ్గాన్​ జిహాదీలతో కలిసి జేఈఎం దాడులకు ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాల సమాచారం. జైషే అధినేత మసూద్​ అజార్​ సోదరుడు రవూఫ్​ అజార్​ నేతృత్వంలో భారత ప్రధాన నగరాల్లో దాడికి తెగబడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu