ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం..155 మంది సేఫ్

హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి వస్తున్న ఇండిగో విమానంలో.. ల్యాండ్ చేస్తున్న సమయంలో టైర్లలో నుంచి పొగలు వచ్చాయి. అది గమనించిన పైలట్ వెంటనే విమానాశ్రయ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో ఉన్న 155 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

  • Tv9 Telugu
  • Publish Date - 8:24 pm, Tue, 27 August 19