హైదరాబాద్‌ చేరుకున్న ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు హైదరాబాద్‌ చేరుకుంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలుచుకుని సింధు చరిత్ర సృష్టించింది. ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసిన అనంతరం ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. బేగంపేట విమానాశ్రయంలో సింధు, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు ఘనస్వాగతం లభించింది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆమె ప్రభుత్వం తరుపున స్వాగతం పలికారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ సాధించిన […]

హైదరాబాద్‌ చేరుకున్న ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు
World Badminton Championships 2019 Highlights: PV Sindhu beats Nozomi Okuhara 21-7, 21-7 to win gold
Follow us

|

Updated on: Aug 27, 2019 | 8:34 PM

భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు హైదరాబాద్‌ చేరుకుంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలుచుకుని సింధు చరిత్ర సృష్టించింది. ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసిన అనంతరం ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. బేగంపేట విమానాశ్రయంలో సింధు, కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు ఘనస్వాగతం లభించింది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆమె ప్రభుత్వం తరుపున స్వాగతం పలికారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ సాధించిన తొలి భారత షట్లర్‌గా సింధు చరిత్రను లిఖించింది.