Brahmos: బ్రహ్మోస్ క్షిపణి లేటెస్ట్ వెర్షన్ టెస్ట్ విఫలం..కారణాలు కనుగొనే పనిలో శాస్త్రవేత్తలు

Brahmos: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ సోమవారం పరీక్ష కాల్పుల్లో విఫలమైంది.

Brahmos: బ్రహ్మోస్ క్షిపణి లేటెస్ట్ వెర్షన్ టెస్ట్ విఫలం..కారణాలు కనుగొనే పనిలో శాస్త్రవేత్తలు
Brahmos
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: KVD Varma

Updated on: Jul 13, 2021 | 4:09 PM

Brahmos: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ సోమవారం పరీక్ష కాల్పుల్లో విఫలమైంది. టేకాఫ్ అయిన వెంటనే బ్రహ్మోస్ నేలమీద పడిందని చెబుతున్నారు. 450 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను చేధించగల బ్రహ్మోస్ క్షిపణిని ఇటీవల నవీకరించారు. ఈ నవీకరించిన క్షిపణిని ఒడిశా తీరంలో పరీక్షించారు. ఈ సందర్భంగా ఇది విఫలం అయిందని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, క్షిపణి ప్రొపల్షన్ వ్యవస్థలో లోపం కారణంగా పరీక్షలో ఈ సమస్య సంభవించింది. అయితే, దర్యాప్తు తర్వాతే సరైన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. సోమవారం ఉదయం ప్రయోగించిన వెంటనే క్షిపణి పడిపోయిందని వార్తా సంస్థ ANI వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది.

ఇప్పుడు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ), బ్రహ్మోస్ ఏరోస్పేస్ కార్పొరేషన్ శాస్త్రవేత్తల సంయుక్త బృందం దాని వైఫల్యానికి గల కారణాలను పరిశీలిస్తోంది. బ్రహ్మోస్ చాలా నమ్మకమైన క్షిపణి. ఇది ఇప్పటివరకూ పరీక్షల్లో విఫలమైన సందర్భాలు చాలా తక్కువ.

బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి 300 కిలోమీటర్ల కంటే తక్కువ లక్ష్యాలను చేధించడానికి గతంలో ఉపయోగించారు. ఇటీవల దీనిని మరింత సమర్ధవంతంగా చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇది ఇప్పుడు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థానాలపై దాడి చేయగలదు. వేగం విషయానికొస్తే, ప్రపంచంలోని వేగవంతమైన కొన్ని క్షిపణులలో బ్రహ్మోస్ ఒకటిగా చెబుతారు. దీని గరిష్ట వేగం గంటకు 4,300 కిమీ కంటే ఎక్కువ. ఈ క్షిపణి చాలా పోర్టబుల్. అంటే వీటిని ప్రయోగించడం చాలా సులభం.

రష్యా సహకారంతో ఈ క్షిపణిని తయారు చేశారు. దీనికి ముందు భారతదేశం బ్రహ్మోస్ అనేక వెర్షన్లను విడుదల చేసింది. భారత ఏజెన్సీ డీఆర్డీవో (DRDO), రష్యా ఎంపీవో మషినోస్ట్రోయినియ (NPO Mashinostroeyenia – NPOM) సహకారంతో బ్రహ్మోస్ ఏరోస్పేస్ వాటిని అభివృద్ధి చేసింది. బ్రహ్మోస్ క్షిపణికి రెండు నదుల పేరు పెట్టారు, భారతదేశంలో బ్రహ్మపుత్ర మరియు రష్యాలోని మోస్క్వా. ఈ రెండు పేర్ల మిళితంగా బ్రహ్మోస్ పేరు పెట్టారు.

Also Read: Income Tax Returns: రోజుకు కేవలం 40 వేల ఆదాయపు పన్ను రిటర్న్స్..ఇలా అయితే రిటర్న్స్ దాఖలుకు నాలుగేళ్ళు పడుతుంది

లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతను తొలగిస్తారా? రేపు కీలక నిర్ణయం తీసుకోనున్న సోనియా గాంధీ

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?