AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime news: గుప్త నిధుల కోసం మేనల్లుడి నరబలి.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు

ప్రపంచం సాంకేతికత వైపు వేగంగా అడుగులేస్తున్నా.. మారుమూల ప్రాంతాల్లో ఇంకా మూఢ నమ్మకాలు విజృంభిస్తూనే ఉన్నాయి. మూఢ నమ్మకాలను నమ్మి.. విచక్షణ కోల్పోయి నేరాలకూ పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన విస్తుపరుస్తోంది....

Crime news: గుప్త నిధుల కోసం మేనల్లుడి నరబలి.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
Narabali
Ganesh Mudavath
|

Updated on: Mar 15, 2022 | 4:00 PM

Share

ప్రపంచం సాంకేతికత వైపు వేగంగా అడుగులేస్తున్నా.. మారుమూల ప్రాంతాల్లో ఇంకా మూఢ నమ్మకాలు విజృంభిస్తూనే ఉన్నాయి. మూఢ నమ్మకాలను నమ్మి.. విచక్షణ కోల్పోయి నేరాలకూ పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లో జరిగిన ఓ ఘటన విస్తుపరుస్తోంది. తమ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని తమకు కల వచ్చిందని, అయితే నరబలి ఇస్తేనే నిధి దక్కుతుందని కలలో చెప్పారనే కారణంతో ఓ కుటుంబం దారుణానికి పాల్పడ్డారు. వరసకు మేనల్లుడయ్యే బాలుడిని హత్య(Murder) చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ బాందా జిల్లా చిత్రకూట్(Chitrakoot) ప్రాంతంలోని కొత్వాలి ఠాణా పరిధిలో దారుణం జరిగింది. తమ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని తమకు కల వచ్చిందని, అయితే చిన్నారిని బలిస్తేనే అవి దక్కుతాయని కలలో చెప్పారని పోలీసుల విచారలో నిందితులు ఒప్పుకోవడం గమనార్హం. గ్రామంలోని నివాసముండే భుల్లు వర్మ, ఊర్మిళలు మృతి చెందిన బాలుడికి అత్తామామలు అవుతారు. వీరి ఇళ్లు దగ్గరగానే ఉండడంతో బాలుడు తరచూ భుల్లు వర్మ ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో మార్చి 8న చిన్నారి కనిపించకుండా పోయాడు. దీంతో అతని తండ్రి రామ్​ప్రయాగ్ రాయ్​దాస్ చుట్టుపక్కలా వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఇక ఏం చేయాలో తెలియక​పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజులు వెతికినా బాలుడి ఆచూకీ దొరకలేదు.

ఇంతలో భుల్లు వర్మ ఇంటి నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు.. ఓ కంటైనర్​లో చిన్నారి శవాన్ని గుర్తించారు. అతడి మృతదేహంతో క్షుద్రపూజలు చేసేందుకు సిద్ధవవుతుండగా నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. బాలుడి శవాన్ని పోస్టుమార్టానికి పంపారు. తమ ఇంట్లో గుప్తు నిధులు ఉన్నాయని దీపావళి పండగ సమయంలో తమకు ఓ కల వచ్చిందని, చిన్నారిని బలిస్తే అవి తిరిగివస్తాయని ఇలా చేశామని నిందితులు విచారణలో చెప్పినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రజలు ఇలాంటి మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు.

Also Read

Rashmi Gautam : రష్మీని ఫిలింనగర్ గేటుకు కట్టేస్తా అని బెదిరించా.. ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్

Hair Splitting: మీ జుట్టు మొత్తం చిట్లిపోతుందా..? అయితే ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టండి..

Kerala News: ఉక్రెయిన్ ప్రజలకు సంఘీభావంగా అక్కడ బాయ్ కాట్.. అదేంటో మీరూ తెలుసుకోండి..