AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఛీ..ఛీ ఇదేం పాడుపనిరా.. ఆర్డర్ ఇచ్చేందుకు వచ్చి మహిళతో..

ముంబైలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్డర్‌ ఇచ్చేందుకు చేసేందుకు వచ్చిన బ్లింకిట్‌కు డెలివరీ బాయ్ తనను అసభ్యంగా తాకుతూ ఇబ్బందులకు గురిచేశాడని ఓ మహిళ ఆరోపించింది. అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఆ మహిళ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, డెలివరీ కంపెనీ బ్లింకిట్‌పై తీవ్ర విమర్శలు చేసింది. దీంతో ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Watch Video: ఛీ..ఛీ ఇదేం పాడుపనిరా.. ఆర్డర్ ఇచ్చేందుకు వచ్చి మహిళతో..
Blkinkit Incident Mumbai
Noor Mohammed Shaik
| Edited By: Anand T|

Updated on: Oct 07, 2025 | 7:30 AM

Share

ముంబైలో ఓ మహిళ ఎదుర్కొన్న అనుచిత ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఆన్‌లైన్ డెలివరీ సేవలందించే బ్లింకిట్‌కు చెందిన ఓ డెలివరీ బాయ్, ఆమెకు ఆర్డర్ చేసిన పార్శిల్‌ను అందించడానికి వచ్చిన సందర్భంలో అనుచితంగా తాకాడని ఆమె ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను ఆ మహిళ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా “X”లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలో డెలివరీ ఏజెంట్ బ్లింకిట్‌కు సంబంధించిన పసుపు రంగు యూనిఫాం ధరించి, ఆ మహిళకు పార్శిల్ ఇవ్వడంతో పాటు చెల్లింపు తీసుకుంటూ కనిపిస్తాడు. అతను చిల్లర తిరిగి ఇస్తున్న సమయంలో అతని చెయ్యి ఆమె ఛాతీకి తాకినట్లు స్పష్టంగా కనిపించిందని ఆమె పేర్కొంది.

ఈ అనుభవం ఆమెకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించిందని ఆమె వివరించింది. ఈ రోజు బ్లింకిట్ నుంచి ఆర్డర్ చేశా. డెలివరీ వ్యక్తి మళ్లీ అడ్రెస్ అడిగాడు. ఆ తర్వాత నన్ను అనుచితంగా తాకాడు. ఇది కరెక్ట్‌ కాదంటూ.. బ్లింకిట్ దయచేసి స్పందించాలంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌తో పాటు ఆమె వీడియోను కూడా షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బ్లింకిట్ కంపెనీపై విమర్శలు వెల్లువెత్తాయి. మొదట బ్లింకిట్ సంస్థ ఈ ఘటనపై స్పందిస్తూ సదరు డెలివరీ బాయ్‌కు హెచ్చరిక జారీ చేసింది. అయితే బాధితురాలు వీడియో ఆధారాలు సమర్పించిన తర్వాత సంస్థ తన నిర్ణయాన్ని మార్చుకుని ఆ డ్రైవర్‌తో ఒప్పందాన్ని రద్దు చేసి అతన్ని తమ ప్లాట్‌ఫామ్ నుంచి బహిష్కరించింది.

ఇక ముంబై పోలీసులు కూడా X ద్వారా స్పందించారు. బాధిత మహిళను వివరాలను DMలో పంచుకోండి అంటూ చెప్పారు. ఆమెను కలిసి మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై నెటిజన్ల నుండి స్పందనలు మిశ్రమంగా వచ్చాయి. కొందరు వినియోగదారులు ఆ మహిళకు మద్దతు తెలుపుతూ, బ్లింకిట్ సంస్థ మరింత బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మరికొందరు మాత్రం ఆ స్పర్శ ఉద్దేశపూర్వకమైనదో లేదో స్పష్టత లేనిదే బాధ్యత వహించాలంటే అది న్యాయం కాదని అభిప్రాయపడ్డారు.

వీడియో చూడండి..

మరిని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.