Gold Price Today: ఆగని పసిడి పరుగులు.. మీ నగరంలో తులం బంగారం ధర ఎంత ఉందంటే?
Gold and Silver Price Today: వేడుక ఏదైనా అందరికీ ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా బంగారం మన సంప్రదాయాల్లో ముడిపడిపోయింది. అయితే గత కొంత కాలంగా దీనిని కొనే పరిస్థితి కనిపించడం లేదు. రాకెట్ వేగంతో బంగారం, వెండి ధరలు పెరిగిపోతుండటంతో సామాన్యులు పసిడి ఊసే ఎత్తడం లేదు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల..

హైదరాబాద్, అక్టోబర్ 7: పండగలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో మగువలు ఒంటి నిండా బంగారు నగలు అలంకరించుకుని తెగ మురిసిపోతుంటారు. అందుకే వేడుక ఏదైనా ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా బంగారం మన సంప్రదాయాల్లో ముడిపడిపోయింది. అయితే గత కొంత కాలంగా దీనిని కొనే పరిస్థితి కనిపించడం లేదు. రాకెట్ వేగంతో బంగారం, వెండి ధరలు పెరిగిపోతుండటంతో సామాన్యులు పసిడి ఊసే ఎత్తడం లేదు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
నిన్నటితో పోల్చితే ఈ రోజు (అక్టోబర్ 7) బంగారం ధరలు స్పల్పంగా పెరిగాయి. 24 క్యారెంట్ల బంగారం గ్రాము ధర రూ.12,078, 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,071, 18 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.9,059గా ఉన్నాయి. ఇక తులం (10 గ్రాములు) ధరలు వరుసగా రూ. 1,20,780, రూ.1,10,710, రూ.90,590 వద్ద కొనసాగుతున్నాయి. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..
హైదారబాద్‌లో 24 క్యారెంట్ల బంగారం గ్రాము ధర రూ.12,078, 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,071, 18 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.9,059గా ఉన్నాయి. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెంట్ల బంగారం గ్రాము ధర రూ.12,138, 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,126, 18 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.9,211గా ఉన్నాయి. ముంబైలో 24 క్యారెంట్ల బంగారం గ్రాము ధర రూ.12,078, 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.11,071, 18 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.9,059గా ఉన్నాయి. బెంగళూరు, కేరళ, పుణె, కలకత్తా వంటి అన్ని నగరాల్లో దాదాపు ఇవే ధరలు ట్రేడ్ అవుతున్నాయి.
వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..?
బులియన్ మార్కెట్లో బంగారం కన్నా.. వెండి ధరలు మరింత వేగంగా దూసుకుపోతున్నాయి. మంగళవారం వెండి కిలోకి రూ.100 పెరిగి ప్రస్తుతం ధర రూ.1,56,100 వద్ద కొనసాగుతుంది. అంటే గ్రాము ధర రూ.156 పలుకుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.1,67,100, కలకత్తాలో 1,56,100, హైదరాబాద్‌లో రూ.1,67,100, విజయవాడలో రూ.1,67,100 వద్ద ట్రేడ్ అవుతుంది.
గమనిక: పైన పేర్కొన్న ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ గోల్డ్ రేట్స్ కోసం 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి








