AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit cards: ఏకంగా 1638 క్రెడిట్ కార్డులు వాడుతూ గిన్నీస్ రికార్డ్! ఇతను చెప్పేది వింటే ఆశ్చర్యపోతారు!

ఎవరైనా ఒకట్రెండు క్రెడిట్ కార్డులు వాడతారు. మహా అయితే ఒక పది. కానీ, హైదరాబాద్ కు చెందిన మనీష్ ఏకంగా 1638 క్రెడిట్ కార్డులు వాడుతూ గిన్నీస్ బుక్ లోకి ఎక్కాడు. అది కూడా అన్నీ యాక్టివ్ గా ఉన్న కార్డులే. అసలు ఇతనికి ఈ ఐడియా ఎలా వచ్చింది? క్రెడిట్ కార్డుల గురించి మనీష్ ఏమంటున్నాడో ఇప్పుడు చూద్దాం.

Credit cards: ఏకంగా 1638 క్రెడిట్ కార్డులు వాడుతూ గిన్నీస్ రికార్డ్!  ఇతను చెప్పేది వింటే ఆశ్చర్యపోతారు!
Credit Cards Manish Dhameja
Nikhil
|

Updated on: Oct 07, 2025 | 11:23 AM

Share

తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన మనీష్ ధమేజా ప్రపంచంలోనే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్న వ్యక్తిగా గిన్నీస్ రికార్డు సాధించాడు. ఏకంగా 1,638 యాక్టివ్ క్రెడిట్ కార్డులతో అతిపెద్ద క్రెడిట్ కార్డ్ యూజర్ గా రికార్డు నెలకొల్పాడు. అయితే క్రెడిట్ కార్డులు కేవలం ఆర్థిక అవసరాల కోసమే కాదని, అవి అంటే తనకెంతో ఇష్టమని చెప్తున్నాడు. “క్రెడిట్ కార్డు నాకు అవసరం మాత్రమే కాదు. అవంటే నాకు తెలియని ఇష్టం. అవి లేకుండా నా జీవితం అసంపూర్ణం. క్రెడిట్ కార్డ్స్ ద్వారా వచ్చే గిఫ్ట్ లు, రివార్డ్ లు చాలా అద్భుతమైనవి” అని మనీష్ చెప్పుకొచ్చాడు.

నోట్ల రద్దు సమయంలో..

మనదేశంలో 2016లో జరిగిన పెద్ద నోట్ల రద్దు సమయంలో అందరిలాగే మనీష్ కూడా భయాందోళనలకు గురయ్యాడు. ఈ సమయంలోనే మనీష్ క్రెడిట్ కార్డులు వాడడం అలవాటు చేసుకున్నాడు. తన ఖర్చుల కోసం కరెన్సీకి బదులు డిజిటల్ పేమెంట్స్ వాడడం స్టార్ట్ చేశాడు.  ఇలా మనీష్ తన క్రెడిట్ కార్డ్ జర్నీని మొదలుపెట్టాడు.  ఇక రానురాను క్రెడిట్ కార్డులు తనకు ఆర్థిక స్వేచ్ఛతో పాటు రివార్డులు, ఇతర డిస్కౌంట్లు కూడా అందిస్తుండడంతో క్రెడిట్ కార్డుల సంఖ్యను పెంచుకుంటూ పోయాడు.

లెక్కలేనన్ని రివార్డ్స్

మనీష్ కు ట్రావెల్ సమయంలో క్రెడిట్ కార్డులు బాగా ఉపయోగపడేవట.  రైల్వే విమానాశ్రయ లాంజ్‌లకు యాక్సెస్, ఫుడ్, స్పా సేవలు, హోటల్ వోచర్లు, ఫ్లైట్ టిక్కెట్స్ లో డస్కౌంట్స్, షాపింగ్ వోచర్లు, సినిమా టిక్కెట్లు, గోల్ఫ్ సెషన్‌లు… ఇలా క్రెడిట్ కార్డ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ పొందేవాడట. ఇలా క్రెడిట్ కార్డ్స్ తో తన బంధాన్ని పెంచుకుంటూ ఏకంగా 1638 కార్డులు తీసుకున్నాడు. దాంతో ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్న వ్యక్తిగా గిన్నీస్ రికార్డులోకి ఎక్కాడు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్‌ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..