Black Fungus: రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంటువ్యాధిగా బ్లాక్ ఫంగస్..
Black Fungus in Rajasthan: దేశంలో ఓ వైపు కరోనావైరస్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో మరోవైపు బ్లాక్ ఫంగస్ కూడా భయాందోళనకు గురించేస్తోంది. రెండు మహమ్మారులు
Black Fungus in Rajasthan: దేశంలో ఓ వైపు కరోనావైరస్ విజృంభిస్తోంది. ఈ తరుణంలో మరోవైపు బ్లాక్ ఫంగస్ కూడా భయాందోళనకు గురించేస్తోంది. రెండు మహమ్మారులు కూడా ప్రజలపై ముప్పేట దాడి చేస్తుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. అయితే.. ఎక్కువగా బ్లాక్ ఫంగస్ (మ్యూకోర్‌మైకోసిస్ ) కోవిడ్ నుంచి కోలుకున్న వారిని చుట్టుముడుతోంది. ఈ నేపథ్యంలో మ్యూకోర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) ను రాజస్థాన్ ప్రభుత్వం అంటువ్యాధిగా ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయి. అయితే వీరందరికీ చికిత్స అందించేందుకు ప్రభుత్వం జైపూర్‌లోని సవాయ్‌మన్ సింగ్ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించింది. ఈ మేరకు రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా పేర్కొంటూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మ్యూకోర్‌మైకోసిస్‌ను అంటువ్యాధిగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం 2020 కింద రాష్ట్రంలో దీనిని కూడా చేర్చినట్లు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌లకు నాణ్యమైన, సమగ్రమైన చికిత్సను అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు అరోరా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా మధుమేహ రోగులు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు కూడా చేసింది. అటు కరోనా.. ఇటు బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది.
Also Read: