Viral News: కొత్త పెళ్లికూతురు సిగ్గు.. కోవిడ్ సిబ్బంది కొంపముంచింది.. అసలేం జరిగిందంటే.!
కరోనా టెస్ట్ ఎలా చేస్తారు.. ముక్కు లేదా గొంతులో.. చెక్ చేస్తారు. అయితే..కోవిడ్ టెస్ట్ కోసం వచ్చిన ఓ కొత్త పెళ్లి కూతురు అధికారులను ముప్పుతిప్పలు..
కరోనా టెస్ట్ ఎలా చేస్తారు.. ముక్కు లేదా గొంతులో.. చెక్ చేస్తారు. అయితే..కోవిడ్ టెస్ట్ కోసం వచ్చిన ఓ కొత్త పెళ్లి కూతురు అధికారులను ముప్పుతిప్పలు పెట్టి.. మూడుచెరువుల నీళ్లు తాగించింది. ఆమె చేసిన నిర్వాకంతో చివరకు అక్కడి సిబ్బంది వీపులు పగిలేలా దెబ్బలు తినాల్సి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకుంది.
యూపీలోని అలీఘర్ జిల్లా షాహ్ నగర్ సరౌలా గ్రామంలో మే 18న అధికారులు కోవిడ్ టెస్ట్ సెంటర్ ఏర్పాటు చేశారు. గ్రామస్తులందరికీ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడానికి సిబ్బంది వచ్చారు. ఈ సమయంలో 37 మందికి పరీక్షలు నిర్వహించి మరికొందరికి చేస్తున్నారు. వారితో పాటు కొత్తగా పెళ్లయిన ఓ అమ్మాయి కూడా వచ్చింది. తలపై కొంగుతోనే అధికారుల వద్దకు వచ్చింది. కరోనా టెస్ట్ చేయాలంటే..కొంగును తీయాలని ఆమెను అధికారులు అడిగారు. అయితే ఆమె సిగ్గుతో అలానే ఉండిపోయింది.
అమ్మాయి కొంగు తీసేందుకు నిరాకరించడంతో అక్కడ ఉన్న పురుషులను దూరంగా వెళ్లమని చెప్పారు వైద్య సిబ్బంది. దీంతో గ్రామస్తులు వైద్య సిబ్బందిపై దాడి చేశారు. వీరి దాడిలో ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ టైమింగ్ మారిందా.? ఇందులో నిజమెంత.!
ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు సింహం దాగి ఉంది.. ఎక్కడ ఉందో గుర్తుపట్టండి చూద్దాం.!