Petrol Diesel Price Today: ఈ రోజు  హైదరాబాద్‌లో పెట్రోల్ రేట్ పెర‌గ‌లేదుగా.. కొన్ని చోట్ల మాత్రం స్వ‌ల్ప త‌గ్గుద‌ల‌..

Petrol Diesel Price Today: గ‌త కొన్ని రోజుల క్రితం జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల స‌మ‌యంలో దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో పెరుగుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. అంత‌కు ముందు ప్ర‌తి రోజూ పెరుగుతూ వ‌చ్చిన ఇంధ‌న ధ‌ర‌ల...

Petrol Diesel Price Today: ఈ రోజు  హైదరాబాద్‌లో పెట్రోల్ రేట్ పెర‌గ‌లేదుగా.. కొన్ని చోట్ల మాత్రం స్వ‌ల్ప త‌గ్గుద‌ల‌..
Petrol Diesel Price
Follow us
Narender Vaitla

|

Updated on: May 20, 2021 | 7:27 AM

Petrol Diesel Price Today: గ‌త కొన్ని రోజుల క్రితం జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల స‌మ‌యంలో దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో పెరుగుద‌ల‌కు బ్రేక్ ప‌డింది. అంత‌కు ముందు ప్ర‌తి రోజూ పెరుగుతూ వ‌చ్చిన ఇంధ‌న ధ‌ర‌ల పెంపు కొన్ని రోజులు ఆగిపోయింది. అయితే తాజాగా మ‌ళ్లీ పెట్రోల్, డీజిల్ ధ‌ర‌కు రెక్క‌లొచ్చాయి. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ ధ‌ర‌లు పెరుగుతున్నాయి. అయితే గురువారం కొంతమేర ఇంధ‌న ధ‌ర‌ల‌కు బ్రేక్ ప‌డిన‌ట్లు బ్రేక్ ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇక దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఇంధ‌న ధ‌ర‌లు ఎలా ఉన్నాయి.? ఓ లుక్కేయండి…

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 92.85 గా ఉండ‌గా.. డీజిల్ రూ. 83.51 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 99.14 గా ఉండగా… డీజిల్ రూ. 90.71 గా న‌మోదైంది.

* త‌మిళ‌నాడు రాజ‌ధానికి చెన్నైలో గురువారం లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 94.54 గాఉంది. ఇక డీజిల్ విష‌యానికొస్తే బుధ‌వారంతో పోలిస్తే స్వ‌ల్పంగా తగ్గి రూ. 88.34 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో లీటర్ పెట్రోల్ ధ‌ర రూ. 95.94 ఉండ‌గా.. డీజిల్ రూ. 88.53 వ‌ద్ద కొన‌సాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధ‌న ధ‌ర‌లు ఇలా ఉన్నాయి…

* తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్‌లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు స్థిరంగా కొన‌సాగుతున్నాయి. ఇక్కడ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 96.50 ఉండ‌గా.. డీజిల్ రూ. 91.04 వ‌ద్ద ఉంది.

* తెలంగాణ‌లో మ‌రో ముఖ్య ప‌ట్ట‌ణ‌మైన క‌రీంన‌గ‌ర్‌లో ధ‌రల్లో కాస్త త‌గ్గుద‌ల క‌నిపించింది ఇక్క‌డ‌ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 96.37 గా ఉండ‌గా.. డీజిల్ ధ‌ర రూ. 90.91 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* విజ‌య‌వాడ‌లోనూ ధ‌ర‌లు త‌గ్గాయి ఇక్క‌డ‌ లీట‌ర్ పెట్రోల్ రూ. 98.97 వ‌ద్ద కొన‌సాగుతుండ‌గా.. డీజిల్ ధ‌ర రూ. 92.95 గా ఉంది.

* సాగ‌ర న‌గ‌రం విశాఖ‌లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల్లో స్వ‌ల్ప త‌గ్గుద‌ల క‌నిపించింది. ఇక్క‌డ లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 98.07 గా ఉండ‌గా.. డీజిల్ ధ‌ర రూ. 92.06 గా ఉంది.

Also Read: Prabhas’s Salaar: పాన్ ఇండియా ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో అందాల చంద్రముఖి.. ఏ పాత్రలో అంటే..

KCR : కరోనా రోగుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం.. ప్రభుత్వాసుపత్రులు సందర్శిస్తోన్న సీఎం కేసీఆర్, రేపు వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి

Black Fungus: రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంటువ్యాధిగా బ్లాక్ ఫంగస్‌..