AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas’s Salaar: పాన్ ఇండియా ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో అందాల చంద్రముఖి.. ఏ పాత్రలో అంటే..

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మంచి దూకుడు మీదున్నాడు . వరుసగా భారీ సినిమాలను లైన్ లో పెడుతూ కెరియర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

Prabhas's Salaar: పాన్ ఇండియా ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో అందాల చంద్రముఖి.. ఏ పాత్రలో అంటే..
Rajeev Rayala
|

Updated on: May 20, 2021 | 7:14 AM

Share

Prabhas’s Salaar:

రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మంచి దూకుడు మీదున్నాడు . వరుసగా భారీ సినిమాలను లైన్ లో పెడుతూ కెరియర్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మొన్నటి వరకు టాలీవుడ్ వరకే క్రేజ్ ఉన్న ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఆతర్వాత వచ్చిన సాహో  సినిమాతో బాలీవుడ్ లో భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. దాంతో ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలనే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేసిన డార్లింగ్ ఇప్పుడు సలార్ పై దృష్టి పెట్టాడు. కేజీఎఫ్ సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఆ మధ్య విడుదలైన సలార్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా గురించి రోజు ఎదో ఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

తాజాగా ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సిస్టర్ గా రమ్యకృష్ణ నటించనున్నారని ఈ మధ్య టాక్ నడిచింది. బాహుబలి సినిమాలో ప్రభాస్ కు తల్లిగా నటించిన రమ్యకృష్ణ సలార్ సినిమాలో అక్కగా నటించనుందని వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలో నిజం లేదని తెలుస్తోంది. ప్రభాస్ సోదరి పాత్ర కోసం ‘జ్యోతిక’ను సంప్రదించారని అంటున్నారు. ఇటీవల జ్యోతికను కలిసి ఆమె పాత్రను  వినిపించారని.. కథ నచ్చడం.. పైగా పాన్ ఇండియా మూవీ కావడంతో జోతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

రియల్ హీరో నుంచి రీల్ హీరోగా మారనున్న సోనూసూద్.. పాన్ ఇండియా సినిమాతో సోనూ బాయ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

ప్రపంచం నాశనం అయినా మన దగ్గర వేడి వేడి పాస్తా, చికెన్ రైస్.. ఎమర్జెన్సీ ఫుడ్ అంటూ పూరీ జగన్నాథ్ ఓపెన్ కామెంట్స్..

Follow Us
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
ఎండు చేపలు వండే ముందు ఈ చిట్కా పాటిస్తే.. అస్సలు వాసన రాదు..
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
తనపై వస్తున్న విమర్శలపై టీవీ9తో హైడ్రా కమిషర్ రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
ప్రియుడిని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
పాత దువ్వెనలను పారేస్తున్నారా? ఇలాంటి ఐడియాలతో మళ్లీ వాడేయండి!
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
చెరుకు రసం Vs పుచ్చకాయ రసం.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది మంచిది..?
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
బంగారం ధరల్లో భారీ క్రాష్.. త్వరలో రూ.1.20 లక్షలకు డౌన్..!
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
జొన్న ఇడ్లీలు ఇలా చేసుకుని.. పల్లీల చట్నీతో తింటే రుచి అదుర్స్
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
మీతో సినిమా చేయాలనుందని ఆయనకు చెబితే..
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు మృతి
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్.. మార్పులు ఇవే..