ప్రపంచం నాశనం అయినా మన దగ్గర వేడి వేడి పాస్తా, చికెన్ రైస్.. ఎమర్జెన్సీ ఫుడ్ అంటూ పూరీ జగన్నాథ్ ఓపెన్ కామెంట్స్..
Puri Jagannadh: మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రామ్ పోతినేని, నభా నటేష్,
Puri Jagannadh: మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రామ్ పోతినేని, నభా నటేష్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ మళ్లీ తన ఫాంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఈ మాస్ డైరెక్టర్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో లైగర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. పూరీ జగన్నాథ్ ఇటీవల పూరీ మ్యూజింగ్స్ ద్వారా పలు విషయాలపై స్పందిస్తున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్ ఎమర్జెన్సీ ఫుడ్ గురించి వివరణ ఇచ్చారు. అనుకోని విపత్తులు వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఎమర్జెన్సీ ఫుడ్ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నాడు.
యుద్ధాలు రావొచ్చు, వరదలు రావొచ్చు.. ఒకవేళ సునామీలో చిక్కుకుపోవచ్చు. లేదా ఇప్పుడు చూస్తున్న విపత్తులాంటివే మరోకటి వచ్చి లాక్ డౌన్ పెట్టొచ్చు. ఏదో దరిద్రం జరిగి ఒక నెల పాటు కరెంట్ పోవచ్చు. క్యాంపింగ్ కు వెళ్ళినప్పుడు మన వాహనం పాడైపోవచ్చు. దీంతో మీరు అడవి మధ్యలో చిక్కుకుపోవచ్చు. అలాంటి సమయంలో మనం సర్వే కావడం కోసం ఎమర్జెన్సీ ఫుడ్ రెడీ చేశారు. ఈ ప్యాకెట్స్ ఒక డబ్బాలో ఉంటాయి. వీటిని వండాల్సిన అవసరం లేదు. ఒక కప్పు వేడి నీళ్లు కలిపి దానిని తీసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్, లంఛ్, డిన్నర్ చొప్పున ఒక నెలకు సరిపడా ఫుడ్ ప్యాకెట్స్‌తో బకెట్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా రెండు రోజులకు సరిపడా ప్యాకెట్స్ దొరుకుతాయి. బార్లీ, కినోవా, ఓట్స్, న్యూడిల్స్, పాస్తా లాంటి ఫుడ్ ఐటమ్స్ ఒక బకెట్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే పాతికేళ్ళలోపు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఇందులో సూప్స్, చికెన్ నూడిల్స్, పాస్తా.. ఇలా ఏది కావాలంటే అది మీరు కొనుగోలు చేసుకోవచ్చు. దీనిని చాలా కంపెనీలు అందిస్తున్నాయి. ఈ ఫుడ్ ను మిలిటరీ వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు కూడా ఒక బకెట్ ఎమర్జెన్సీ ఫుడ్ తెచ్చుకోండి. ఒకవేళ ప్రపంచం నాశనం అయిన మీ దగ్గర వేడి వేడి చికెన్ రైస్, పాస్తా రెడీగా ఉంటాయి అని చెప్పారు పూరీ జగన్నాథ్.
వీడియో..