AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్న తమిళియన్స్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ పై మండిపడుతున్న ఆడియన్స్..

The Family Man 2: టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని, మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2

సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్న తమిళియన్స్.. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ పై మండిపడుతున్న ఆడియన్స్..
Family Man 2
Rajitha Chanti
|

Updated on: May 19, 2021 | 9:31 PM

Share

The Family Man 2: టాలీవుడ్ హీరోయిన్ సమంత అక్కినేని, మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’. ఈ సిరీస్ కోసం ప్రేక్షకులుగా ఎంతగానో ఎదురుచూశారు. ఇక వారి ఎదురుచూపులకు విముక్తి కలిగిస్తూ.. మే 19న మేకర్స్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ట్రైలర్ విడుదల చేసారు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్ శ్రీకాంత్ తివారీ అనే పోలీస్ పాత్రలో నటించగా.. సమంత అక్కినేని రాజీ అనే ఉగ్రవాది పాత్రలో నటించింది. అయితే ఇందులో తమ ఉగ్రవాది పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక అన్ని సజావుగా ఉన్న సమయంలో సమంతకు అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. ఈ ట్రైలర్ చూసిన తమిళియన్స్ సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

ఆ ట్రైలర్‏లో తమిళనాడు ప్రజలను ఉగ్రవాదులుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన సమంత అలాంటి పాత్ర చేయడంతో తమిళ ప్రేక్షకులు మండిపడుతున్నారు. ట్రైలర్ విడుదలైన కాసేపట్లోనే ట్విట్టర్ ఖాతాలో ది ఫ్యామిలీ మ్యాన్ 2కు తమిళులు వ్యతిరేకం (Family Man 2 Against Tamils) అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. LTTE అనేది టెర్రరిస్ట్ కాదని.. అది తమిళుల హక్కుల కోసం పోరాడిన ఆర్మీ అని.. దానిని తప్పుగా చూపించారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 స్ట్రీమింగ్ ఆపాలని.. వెంటనే చిత్రయూనిట్ తమిళియన్స్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ పూర్తిగా సున్నితమైనది.. అలాగే తమిళులను ఉగ్రవాదులుగా చూపించడం అనేది చాలా తప్పని.. ఈ సిరీస్ ట్రైలర్ లో చూపించిన విధంగా ఉంటే… తమిళులు అందరూ అమెజాన్ ప్రైమ్ ఉపయోగించడం ఆపేస్తాం అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. అలాగే ఈ సిరీస్ ను శాశ్వతంగా నిషేధించాలని.. తమ రాష్ట్రంలో ఈ సిరీస్ ప్రదర్శించవద్దని కోరారు.. షేమ్ ఆన్ యూ సమంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్వీట్స్..

Also Read: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ విడుదల.. ఉగ్రవాది పాత్రలో ఆకట్టుకున్న సమంత .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Follow Us
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.