AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ ట్రైలర్ విడుదల.. ఉగ్రవాది పాత్రలో ఆకట్టుకున్న సమంత .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

The Family Man2: 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయి..

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' ట్రైలర్ విడుదల.. ఉగ్రవాది పాత్రలో ఆకట్టుకున్న సమంత .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
The Family Man 2
Rajitha Chanti
|

Updated on: May 19, 2021 | 3:56 PM

Share

The Family Man2: ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయి.. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‏కు సిక్వెల్ గా దీనిని తెరకెక్కించారు. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులు కూడా ఆసక్తిగానే వేచి చూస్తున్నారు. ఇందుకు కారణం.. టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇందులో ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా.. డీ గ్లామర్ అండ్ నెగిటివ్ రోల్ లో కనిపించడం. అయితే ఇప్పుడు ఆడియన్స్ ఎదురుచూపులకు స్వస్తి పలికారు మేకర్స్. ఈరోజు ఉదయం ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత అక్కినేని ప్రధాన పాత్రలలో నటించారు.

ఇక ఇవాళ విడుదలైన ట్రైలర్ విషయానికి వస్తే.. ఎప్పటిలాగే మనోజ్ బాజ్ పాయ్.. శ్రీకాంత్ తివారీ పాత్రలో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే సమంత.. ఇందులో ఉగ్రవాది పాత్రలో కనిపించనుంది. మొదటి సిరీస్ కంటే సెకండ్ సిరీస్ మరింత ఆసక్తికరంగా రూపొందించారు మేకర్స్. ఇక ఇందులో సమంత మరోసారి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఫ్యామిలీ మ్యాన్ 2 సమంతకు మొదటి వెబ్ సిరీస్. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘సిరీస్.. అమెజాన్ ప్రైమ్ లో జూన్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇక ఇందులో షరీబ్ హష్మి, శరద్ కేల్కర్ శ్రేయా ధన్వంతరి తదితరులు కీలక పాత్రలలో నటించారు.

ట్వీట్..

వీడియో..

Also Read: మధురమైన గాత్రం.. గమ్మత్తైన గమకాలతో పాటకు ప్రాణం పోస్తాడు.. మ్యూజిక్ లవర్స్‏కు మోస్ట్ వాంటెడ్ సింగర్‏గా సిధ్ శ్రీరామ్

vijay devarakonda : సుకుమార్ సినిమాకంటే ముందే మూడు సినిమాలను లైన్ లో పెట్టిన రౌడీ బాయ్