Ravi Teja’s Khiladi: మాస్ మహారాజ రవితేజ ‘ఖిలాడి’ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు .. ఓటీటీకి నో..

క్రాక్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ట్రాక్ లోకి వచ్చిన మాస్ మహారాజ రవితేజ.. ఇప్పుడు అదే జోరులో ఖిలాడి సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు.

Ravi Teja's Khiladi: మాస్ మహారాజ రవితేజ 'ఖిలాడి' పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు .. ఓటీటీకి నో..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 19, 2021 | 1:39 PM

Ravi Teja’s Khiladi: క్రాక్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ట్రాక్ లోకి వచ్చిన మాస్ మహారాజ రవితేజ.. ఇప్పుడు అదే జోరులో ఖిలాడి సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన క్రాక్ సినిమా రవితేజను ఫ్లాప్ లనుంచి బయటపడేసింది. అనీల్ రావిపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న రవితేజకు క్రాక్ సినిమా మంచి బస్ట్  ఇచ్చింది. అదే ఊపులో ఇప్పుడు .రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. రాక్షసుడు వంటి సినిమాతో హిట్ అందుకునం రమేష్ వర్మ .. రవితేజ కోసం ఓ సస్పెన్స్ థ్రిల్లర్ ను సిద్ధం చేసాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసాయి. ఇక ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి పెరిగే సరికి ఇండస్ట్రీలో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి సినిమా రిలీజ్ డేట్స్ వాయిదా పడిపోయాయి. అలాగే మాస్ రాజా “ఖిలాడి” కూడా వాయిదా పడింది. సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేసినట్లు ఇదివరకే మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథాకథనాలతో రమేశ్ వర్మ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి – డింపుల్ హయతి అలరించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిఅందిస్తున్నారు. ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ అలాంటి ఆలోచనేం చేయలేదనీ, ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తామని నిర్మాతలు క్లారిటీ  ఇచ్చారు. మరో వైపు ఈ మూవీ డిజిటల్ రైట్స్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వారికీ అమ్ముడైనట్లు టాక్ నడుస్తుంది.

మరిన్ని  ఇక్కడ చదవండి : 

Paagal Movie : పాగల్ పై క్లారిటీ ఇచ్చిన మాస్ కా దాస్.. ఓటీటీకి వెళ్ళేదే లేదన్న విశ్వక్ సేన్…

Jr NTR : అభిమానులకు యంగ్ టైగర్ విన్నపం… పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న తారక్.. జాగ్రత్తగా ఉండాలని కోరిన ఎన్టీఆర్

Nidhhi Agerwal: మంచిమనసు చాటుకున్న నిధి అగర్వాల్.. సీఎం రీలీఫ్ ఫండ్ కు విరాళం అందించిన హీరోయిన్..