Paagal Movie : పాగల్ పై క్లారిటీ ఇచ్చిన మాస్ కా దాస్.. ఓటీటీకి వెళ్ళేదే లేదన్న విశ్వక్ సేన్…

ఈ నగరానికి ఏమైంది సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ ను అందుకోవడమేకాకుండా సూపర్ క్రేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు మాస్ హీరో విశ్వక్ సేన్.

Paagal Movie : పాగల్ పై క్లారిటీ ఇచ్చిన మాస్ కా దాస్.. ఓటీటీకి వెళ్ళేదే లేదన్న విశ్వక్ సేన్...
Follow us
Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Updated on: May 19, 2021 | 3:56 PM

Paagal Movie : ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి హిట్ ను అందుకోవడమేకాకుండా సూపర్ క్రేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు మాస్ హీరో విశ్వక్ సేన్. ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత ఫలక్ నామ దాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో మాస్ కా దాస్ అనే టాగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక నాని నిర్మాతగా ,వ్యవహరించిన సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ సినిమాతో హ్యాట్రిక్ అందుకున్నాడు ఈ మాస్ కా దాస్. హిట్ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు పాగల్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ల‌క్కీ మీడియా ప‌తాకాల‌పై అభిరుచి గల నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పక్కా రొమాంటిక్ యాంగిల్‌లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమానుంచి టీజర్ ,రెండు పాటలను విడుదల చేశారు.

వీటిలో పాగల్ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. జాతిరత్నాలు సినిమాలో ‘చిట్టి నా బుల్ బుల్ చిట్టి’ అనే పాటపాడిన రామ్ ఈ పాటను ఆలపించారు. ఇక ఈ సినిమా విడుదల పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా పాగల్ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలో హీరో విశ్వక్ సేన్ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చాడు. ‘పాగల్’ ఓటీటీకి వెళుతుందనే ప్రచారంలో నిజం లేదనీ, ఈ సినిమా థియేటర్లకే వస్తుందని స్పష్టం చేశాడు విశ్వక్ సేన్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ అందిస్తామని తెలిపారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నివేద పేతు రాజ్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఫుల్ జోష్ లో ఇస్మార్ట్ శంకర్.. లవర్ బాయ్ నుంచి మాస్ హీరో రేంజ్ కు షిఫ్ట్ .. తగ్గని క్రేజ్ : Ram Pothineni Video.

సీనియర్ నటి పావలా శ్యామలకు చిరంజీవి ఆర్థిక సాయం.. ‘మా’ అసోసియేషన్ మెంబర్ షిప్ కార్డు.. ప్రతి నెల ఫించన్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే