AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: కరోనాను జయించిన కాంట్రవర్సీ క్వీన్.. పూర్తిగా కోలుకున్న కంగనా ..

కరోనా మహమ్మారి దేశాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలంతా కరోనా వ్యాప్తితో ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Kangana Ranaut: కరోనాను జయించిన కాంట్రవర్సీ క్వీన్.. పూర్తిగా కోలుకున్న కంగనా ..
Kangana
Rajeev Rayala
|

Updated on: May 19, 2021 | 1:20 PM

Share

Kangana Ranaut: కరోనా మహమ్మారి దేశాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలంతా కరోనా వ్యాప్తితో ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫస్ట్ వేవ్ ను మించి సెకండ్ వేవ్ లో వైరస్ బారిన పడుతున్నవారిసంఖ్య అధికంగా ఉంది. మరో వైపు సినిమా తారలు, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడటం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే పలువురు సినీపరిశ్రమకు చెందిన వారు కోవిడ్ బారిన పడ్డారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ కంగనా కు కూడా కరోనా సోకింది.  ఈ నెల 8న తనకు కరోనా సోకినట్టు  తానే స్వయంగా తెలిపింది. సినిమాలతో కంటే వివాదాలతోనే  పాపులారిటీ తెచ్చుకుంది  కంగనా రనౌత్.  సోషల్  మీడియాలో కంగనా రనౌత్ చాలా మందిని టార్గెట్ చేసి తన స్టైల్ లో విమర్శలు చేసింది.

తాజాగా కంగనా కరోనాను జయించింది. తనకు కోవిడ్ టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు తెలిపింది. అలాగే వైరస్ గురించి తప్పుగా మాట్లాడితే మనను విమర్శించే వారు కూడా ఎంతో మంది ఉన్నారని వ్యాఖ్యానించింది. తాను కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పింది. ఇది చిన్ని ఫ్లూ మాత్రమే అయినప్పటికీ… మనుషులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందని వ్యాఖ్యానించింది. తన కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పుకొచ్చింది కంగనా.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Krithi Shetty: అప్ కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చిన బెబమ్మ.. కృతి ఆ సినిమా చేయడం లేదంట..

Jr NTR : అభిమానులకు యంగ్ టైగర్ విన్నపం… పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న తారక్.. జాగ్రత్తగా ఉండాలని కోరిన ఎన్టీఆర్

Paagal Movie : పాగల్ పై క్లారిటీ ఇచ్చిన మాస్ కా దాస్.. ఓటీటీకి వెళ్ళేదే లేదన్న విశ్వక్ సేన్…