Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun Pushpa Movie: రెండు భాగాలుగా బన్నీ పుష్ప.. భారీ బడ్జెట్ తో పార్ట్ 2 ప్లాన్ చేస్తున్న మేకర్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం ఆయన అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Allu Arjun Pushpa Movie: రెండు భాగాలుగా బన్నీ పుష్ప.. భారీ బడ్జెట్ తో పార్ట్ 2 ప్లాన్ చేస్తున్న మేకర్స్..
Allu Arjuna Pushpa Raj
Follow us
Rajeev Rayala

|

Updated on: May 19, 2021 | 12:54 PM

Allu Arjun Pushpa Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం ఆయన అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ ఊరమాస్  లుక్ లో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన  నటిస్తుంది. ఆగస్టు 13న రిలీజ్ డేట్ అనుకున్నా.. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమేనన్న క్లారిటీకొచ్చేశారు మేకర్స్. సేమ్ టైం… సినిమా కంటెంట్ విషయంలో కూడా మేజర్ డెసిషన్ తీసుకున్నారట‌. పుష్ప1 అండ్ పుష్ప2.. ఇలా సినిమాను రెండు భాగాలుగా విడగొట్టాలన్నది సుక్కూ వేసిన న్యూ ఐడియా అని ఫిల్మ్ న‌గ‌ర్ టాక్‌. ఇప్పటివరకు 70 పర్సెంట్ షూటింగ్ ముగిసిందని… ఆ రషెస్ తో ఫస్ట్ పార్ట్ ని కంక్లూడ్ చేసి ఆక్టోబర్ 13న రిలీజ్ చేయాలన్నది తాజా ప్లాన్ అట‌. మిగతా పార్ట్ ని నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ చేసేలా స్కెచ్ రెడీ చేశారని టాక్‌. ఇదిలా ఉంటే సీక్వెల్ కి పుష్ప కాకుండా వేరే టైటిల్ ని పరిశీలిస్తున్నారని సమాచారం. మొదటి భాగానికి `పుష్ప` అని పేరు పెట్టారు. మరి రెండో భాగానికి ఎం పేరు పెడతారో చూడాలి.

అయితే సీక్వెల్ వియానికొస్తే.. ఈ సంవత్సరం చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పార్ట్ 2 భారీ స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది . పుష్ప పార్ట్ 2  కోసం మైత్రి మూవీ మేకర్స్ 250 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ను కేటాయించిందని టాక్ నడుస్తుంది. మొదటి భాగం షూటింగ్ పూర్తి కాగానే సీక్వెల్  షూటింగ్  కూడా ప్రారంభమవుతుందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Bandla Ganesh : ఆ వార్తల్లో నిజం లేదంట… పవర్ స్టార్ సినిమా క్లారిటీ ఇచ్చిన బండ్లగణేష్

Jr NTR : అభిమానులకు యంగ్ టైగర్ విన్నపం… పుట్టిన రోజు వేడుకలు జరపవద్దన్న తారక్.. జాగ్రత్తగా ఉండాలని కోరిన ఎన్టీఆర్

Krithi Shetty: అప్ కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చిన బెబమ్మ.. కృతి ఆ సినిమా చేయడం లేదంట..