sirivennela seetharama sastry: సినీ వినీలాకాశంలో ఆయన సిరివెన్నెల.. సాహో… సీతారామ శాస్త్రి

ఆయన కలం నుంచి జాలువారిన సాహిత్యం ఎంతో మంది మదిని మీటుతుంది.  మూడు నాలుగు నిమిషాలుండే పాటలో సినిమా తాలుకు భావాన్ని నింపడం

sirivennela seetharama sastry:  సినీ వినీలాకాశంలో ఆయన సిరివెన్నెల.. సాహో... సీతారామ శాస్త్రి
Siri Vennela
Follow us
Rajeev Rayala

|

Updated on: May 20, 2021 | 9:25 AM

sirivennela seetharama sastry: ఆయన కలం నుంచి జాలువారిన సాహిత్యం ఎంతో మంది మదిని మీటుతుంది.  మూడు నాలుగు నిమిషాలుండే పాటలో సినిమా తాలుకు భావాన్ని నింపడం అదికూడా అర్ధమయ్యే పదాలతో రాయడం అంటే అది అందరికీ సాధ్యం కాదు.. అలా పాటలు రాయడంలో దిగ్గజాలు అయిన మహానుభావులలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒకరు. .నేడు ఈ సినీకవి పుట్టిన రోజు. తన సాహిత్యంతో పాటకు ప్రాణం పోస్తారు సిరివెన్నెల.. “విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం” అంటూ మొదలన ఆయన పాటల ప్రయాణం నిర్విరామంగా కొనసాగుతుంది.

మొదటి సినిమాతోనే తనలోని సరస్వతిని దర్శక దిగ్గజం కళాతపస్వి కె విశ్వనాథ్ కు పరిచయం చేసారు సిరివెన్నెల. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే.. అలాగే రుద్రవీణ సినిమాలో నమ్మకు నమ్మకు ఈ రేయినీ అనే పాట  .. లలిత ప్రియ కమలం విరిసినదీ అనే పాటలను అద్భుతంగా రాసారు సిరివెన్నెల.  లలిత ప్రియా కమలం పాటకు గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.

అలాగే కృష్ణ వంశీ తెరకెక్కించిన సిందూరం సినిమాలో ఆయన రాసిన అర్థ శతాబ్దపు పాట సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.  అగ్నిజ్వాలలను రగిలించే పాటలే కాదు చిగురుటాకు లాంటి అందమైన  ప్రేమ గీతాలను కూడా అందించారు సిరివెన్నెల. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం తెలుగు సినిమాలో నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని… అని పాటను రాయడంమే కాదు అందులో పాడి నటించి మెప్పించారు. ఈ పాటకు సిరివెన్నెలను  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారంతో సత్కరించింది. ఆయన కలం నుంచి జాలువారిన అనేక వేల పాటల్లో ఆణిముత్యాలు ఎన్నో. ఇటీవల వచ్చిన అలవైకుంఠపురం సినిమాలో సామజవరగమనా .. నిను చూసి ఆగగల నా .. అంటూ అలరించారు సిరివెన్నెల. ఇలా సాహిత్యంతో సరిగమలు పలికించే సీతారామ శాస్త్రి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas’s Salaar: పాన్ ఇండియా ప్రభాస్ సినిమాలో కీలక పాత్రలో అందాల చంద్రముఖి.. ఏ పాత్రలో అంటే..

రియల్ హీరో నుంచి రీల్ హీరోగా మారనున్న సోనూసూద్.. పాన్ ఇండియా సినిమాతో సోనూ బాయ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

ప్రపంచం నాశనం అయినా మన దగ్గర వేడి వేడి పాస్తా, చికెన్ రైస్.. ఎమర్జెన్సీ ఫుడ్ అంటూ పూరీ జగన్నాథ్ ఓపెన్ కామెంట్స్..