Mahesh Babu and Trivikram: మహేష్ బాబు సినిమాకోసం భారీ సెట్స్ వేయిస్తున్న గురూజీ..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పరశు రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు న్యూ లుక్ లో కనిపించనున్నాడు.

Mahesh Babu and Trivikram: మహేష్ బాబు సినిమాకోసం భారీ సెట్స్ వేయిస్తున్న గురూజీ..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 20, 2021 | 8:36 AM

Mahesh Babu and Trivikram:

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాకోసం అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పరశు రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు న్యూ లుక్ లో కనిపించనున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పరశు రామ్. ఇప్పటికే ఈ సినిమా దుబాయ్ లో షూటింగ్ జరుపుకొని ఇటీవలే తిరిగి హైదరాబాద్ కు వచ్చింది. ఇక్కడ షూటింగ్ మొదలు పెట్టగానే కరోనా సెకండ్ వేవ్ ఎంట్రీ ఇచ్చింది. దాంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు చిత్రయూనిట్.  దుబాయ్ లో యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించారు. భారీ ఛేజింగ్ సీన్స్ ను అక్కడ చిత్రీకరించారని తెలుస్తుంది. ఈ సినిమాతో మొదటిసారి కీర్తి సురేష్ మాహేష్ తో కలిసి నటిస్తుంది. ఇక ఈ సినిమాలో కావాల్సిన యాక్షన్ తోపాటు.. కడుపుబ్బా నవ్వించే కామెడీ కూడా ఉంటుందని తెలుస్తుంది.

ఈ సినిమాతోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. దాదాపు 11 సంవత్సరాల తరవాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. అతడు, ఖలేజా వంటి సినిమాలతర్వాత వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఈ సినిమాకి ‘పార్థు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో కథ ఏదైనా అది కుటుంబాలు .. బంధాలు చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమా కూడా అదేవిధంగా ఉండబోతుందని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమాకోసం భారీ సెట్స్ కూడా వేస్తున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన డిజైన్స్ ను పరిశీలిస్తున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

sirivennela seetharama sastry: సినీ వినీలాకాశంలో ఆయన సిరివెన్నెల.. సాహో… సీతారామ శాస్త్రి

రియల్ హీరో నుంచి రీల్ హీరోగా మారనున్న సోనూసూద్.. పాన్ ఇండియా సినిమాతో సోనూ బాయ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..

ప్రపంచం నాశనం అయినా మన దగ్గర వేడి వేడి పాస్తా, చికెన్ రైస్.. ఎమర్జెన్సీ ఫుడ్ అంటూ పూరీ జగన్నాథ్ ఓపెన్ కామెంట్స్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే